భయంతో వణికి పోతున్న రెవిన్యూ సిబ్బంది

రెండు రోజుల క్రితం విజయారెడ్డి అనే ఎమ్మార్వోపై సురేష్‌ అనే వ్యక్తి పెట్రోల్‌ పోసి నిప్పు అంటించిన సంఘటన రాష్ట్రంలోని రెవిన్యూ అధికారుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

కేవలం తెలంగాణ మాత్రమే కాకుండా ఆంధ్రాలో కూడా ఈ పరిస్థితి కనిపిస్తుంది.

తాజాగా ఏపీలో పత్తికొండ తాహసీల్దార్‌ ఉమామహేశ్వరి తన చాంబర్‌లోకి ఎవరు రాకుండా ఉండేలా ఒక తాడు కట్టించారు.తన డ్యూటీ సక్రమంగా చేయడంతో పాటు సెక్యూరిటీ కూడా చూసుకోవాలి కదా అంటూ ఆమె వివరణ ఇస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మార్వోలు మరియు రెవిన్యూ సిబ్బంది పరిస్థితి ఇలాగే ఉంది.ఒక రెవిన్యూ ఆఫీస్‌ ముందు ఉద్యోగులు ఆందోళన చేస్తుండగా ఒక మహిళ వచ్చి తాను ఇచ్చిన లంచం తిరిగి ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేయడంతో అక్కడ ఉన్న వారు అంతా కూడా అవాక్కయ్యారు.

విజయారెడ్డి మృతి పట్ల ప్రజలు సానుభూతి వ్యక్తం చేయకపోగా ఎక్కువ శాతం మంది సురేష్‌కు మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారు.రాష్ట్రంలో ఎంత మంది సురేష్‌లు ఉన్నారు అంటూ రెవిన్యూ సిబ్బందిని హెచ్చరిస్తుండటంతో ప్రస్తుతం ప్రతి చోట కూడా రెవిన్యూ అధికారులు భయపడుతున్నారు.

Advertisement

గత రెండు రోజులుగా తెలంగాణలో రెవిన్యూ ఆఫీస్‌లు మూత పడ్డాయి.తెరుచుకున్న తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అంటూ ఆందోళన రెవిన్యూ అధికారల్లో వ్యక్తం అవుతుంది.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు