కోట్లు పలికే అరుదైన పాము.. అమ్ముతుండగా పట్టుకున్న వైనం

ఏదైనా వింత, విచిత్రం జరిగితే మనవాళ్లు చూసేంత ఆసక్తిగా మరే ఇతర దేశస్థులు చూడరనేది వాస్తవం.

కాకపోతే మనవారికి ఎంత ఆతృత ఉంటుందో అంతే మూఢనమ్మకం కూడా ఉంటుందని రుజువు చేసింది తాజా ఘటన.

మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనతో ఒక్కసారిగా పోలీసులు మరియు స్థానికులు ఆశ్చర్యంతో అవాక్కయ్యారు.అయితే ఈ ఘటనలో ఏదో వజ్రవైడుర్యాలు బయటపడ్డాయని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.

మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.అరుదైన జాతికి చెందిన రెండు తలల పామును ఆ రాష్ట్రంలోని నర్సింగ్‌ఘర్‌‌లో ఓ ముఠాకు చెందిన వ్యక్తులు అమ్మకానికి పెట్టినట్లు తెలిసిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు.

ఈ దాడిలో వారికి రెడ్ సాండ్ బో అనే జాతికి చెందిన అరుదైన రెండు తలల పాము చిక్కింది.ఓ ముఠా ఈ పాముని మూఢనమ్మకాలతో మునిగిపోయిన ఓ వ్యక్తికి ఈ ముఠా అమ్మేందుకు ప్రయత్నించగా పోలీసులు సదరు ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు.

Advertisement

రెండు తలల పాము చాలా అరుదైనదని, దానిని పలు ఔషధ, కాస్మెటిక్ మందులలో వాడకానికి వినియోగిస్తారని పోలీసులు తెలిపారు.ఈ పాములో విషం ఉండదని, అందుకే ఇది ప్రత్యేకమైనదని పోలీసులు తెలిపారు.దీంతో ఈ పాముకు అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.1.25 కోట్ల ధర పలుకుతోందని వారు తెలిపారు.గతంలో అ అరుదైన పామును తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలజిల్లా వాసి ఒకరు గుర్తించారు.

వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..
Advertisement

తాజా వార్తలు