ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం జగన్నాటకం జరుగుతుంది.ముఖ్యమంత్రి జగన్ వేస్తున్న వ్యూహాలతో ప్రతిపక్ష పార్టీ టీడీపీ అసలు కోలుకోలేకుండా అయిపోతుంది.
ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలని వైసీపీలో చేర్చుకోకుండానే వారిని మెల్లగా టీడీపీకి దూరం చేస్తున్నారు.ఇంతకాలం చంద్రబాబు రాజకీయాలు చూసిన ఏపీ ప్రజలు ఇప్పుడు జగన్ రాజకీయ చతురత చూస్తున్నారు.
అన్ని ప్రాంతాల ప్రజలని తన వైపుకి ఓ వైపు లాక్కునే ప్లాన్స్ వేస్తూ మరో వైపు తన ప్రత్యర్ధిగా ఉన్న టీడీపీ బలం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.రానున్న ఎన్నికలలో తనకి సరిపోయే బలం విపక్షాలకి ఉండకూడదని ఇప్పటి నుంచి ప్లాన్ అమలు చేసుకుంటూ వెళ్తున్నాడు.
అందులో భాగంగా ఇప్పటికే వల్లభనేని వంశీని టీడీపీకి దూరం చేసి తనకి మద్దతు ఇచ్చేలా చేసుకున్న జగన్ అతనినే అస్త్రంగా చంద్రబాబు మీద ప్రయోగించారు.ఇక వంశీ, బాబు, లోకేష్ మీద ఏ స్థాయిలో విమర్శలు దాడి చేశారో అందరికి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఇప్పుడు మరో టీడీపీ ఎమ్మెల్యేని చంద్రబాబుకి దూరం చేశాడు.గుంటూరు కేంద్రంలో అమరావతిలో రాజధాని విషయం మీద ఆందోళనని చేస్తున్న చంద్రబాబు టీమ్ కి షాక్ ఇచ్చే విధంగా ఇప్పుడు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి జగన్ కి జై కొట్టడానికి రెడీ అయిపోయాడు.
దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లితో కలిసి వెళ్లి జగన్ ని కలిసిన మద్దాలి గిరి బయటకి వచ్చిన తర్వాత జగన్ మూడు రాజధానుల విధానం సరైనది అని చెప్పుకొచ్చారు.అమరావతి రైతులని చంద్రబాబే మోసం చేసారని విమర్శించారు.
పరిపాలనా రాజధానిగా విశాఖ సరైన ప్రాంతం అని ప్రకటించాడు.అలాగే తన నియోజక వర్గ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం జగన్ ని అడిగిన వెంటన్ 50 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చారని చెప్పాడు.
దీనిని బట్టి ఈ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు జగన్ కి జై కొట్టినట్లే అయ్యింది.