ఈ మద్య రాజకీయాల్లో జనసేనానాని పవన్ కళ్యాణ్ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. సిఎం జగన్ టార్గెట్ గా ఆయన చేస్తున్న విమర్శలు, ఆరోపణలు పోలిటికల్ సర్కిల్స్ లో కలకలం రేపుతున్నాయి.
గతంలో ఎప్పుడు లేని విధంగా వాలెంటరీ వ్యవస్థపై పవన్ గురి పెట్టారు.వాలెంటర్లు డేటా చోరీకి పాల్పడుతున్నారని, ఆ హక్కు వారికి ఎవరిచ్చారని.
ఇంతకీ వాలెంటర్లకు బాస్ ఎవరని.ప్రశ్నలు సంధిస్తూ జగన్ సర్కార్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు పవన్.
వాలెంటరీ వ్యవస్థపై పవన్ చేస్తున్న ఆరోపణలకు సరైన సమాధానం ఇవ్వలేక జగన్ బృందం తలలు పట్టుకుంటోంది.
ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీపై మళ్ళీ ప్రశ్నల గైడ్ ను సంధించారు పవన్.
ఈసారి విద్యారంగాన్ని టార్గెట్ చేస్తూ జగన్ సర్కార్ పై ప్రశ్నలు ఎక్కుబెట్టారు.ఏడాది ఒక ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన జగన్.ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని, మెగా డీఎస్సీ లేదు టీచర్ల రిక్రూట్మెంట్ జరగడం లేదు, అంటూ ప్రశ్నలు సంధిస్తూనే.కానీ నష్టాలు వచ్చే స్టార్టప్ కంపెనీలకు కోట్లలో కాంట్రాక్ట్ ఎలా వస్తోందని ఆరోపించారు పవన్.

బైజూస్ కంపెనీ నష్టాల్లో ఉన్న సంగతి తెలియదా ? నష్టాల్లో ఉన్న కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడం వెనుక ఉన్న మర్మం ఏమిటని జగన్ సర్కార్ ప్రశ్నించారు పవన్.దీంతో పవన్ సంధించిన ప్రశ్నలు పోలిటిక్ సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చలకు దారి తీస్తున్నాయి.ఇప్పటికే వాలెంటరీ వ్యవస్థలోని లోపాలను బయట పెడుతూ వైసీపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పవన్.ఇప్పుడు విద్యారంగాన్ని టార్గెట్ చేయడంతో.వైసీపీ మరింత ఇరుకున పడే అవకాశం ఉంది.అయితే పవన్ సాధిందిస్తున్న ప్రశ్నలకు వైసీపీ క్లారిటీ ఇవ్వక పొగా.
వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతూ ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది.మరి పవన్ ప్రశ్నలకు జగన్ ఎప్పుడు సమాధానం చెబుతారో చూడాలి.