తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.రానున్న రెండు రోజులపాటు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలోని రామగుండంలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్ తో పాటు నల్గొండలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

అట ఏపీలోని రాయలసీమలో అత్యధికంగా టెంపరేచర్ నమోదు కాగా.కడప, కర్నూలు, అనంతపురంలో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

విజయవాడ, గుంటూరు, ఏలూరు, రాజమండ్రితో పాటు ప్రకాశం జిల్లాలో 43 డిగ్రీలు నమోదు అయింది.

Advertisement
ఆయన మరణ వార్త చదువుతూ ఏడ్చేసిన యాంకర్..

తాజా వార్తలు