బీసీసీఐ అంటే ప్రపంచంలో ఉండే క్రికెట్ బోర్డులలో అన్నింటికంటే సంపన్నమైంది అని అందరికీ తెలిసిందే.మరి అలాంటి బీసీసీఐ ప్రైజ్ మనీ కూడా భారీగానే ఉంటుంది.
తాజాగా దేశవాళీ టోర్నీలలో విజేతలకు, ఓడిన ఆటగాళ్లకు ఇచ్చే పారితోషకం భారీగా పెంచేసింది.విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ( Jay Shah )ట్విటర్ ద్వారా అధికారకంగా వెల్లడించారు.
బీసీసీఐ ఐపీఎల్ టోర్నీ పరిచయం చేసి కోట్ల రూపాయలు అర్జిస్తూ, ప్రతిభ కలిగిన ఆటగాళ్లకు వేలంలో భారీగా పారితోషికాలు ఇవ్వడంతో పాటు, ప్రసారాల ద్వారా భారీగా సొమ్ము చేసుకుంటుంది.తాజాగా బీసీసీఐ దేశవాళీ క్రికెట్లో పెంచిన ప్రైజ్ మనీ కు సంబంధించిన వివరాలు చూద్దాం.
రంజిత్ ట్రోఫీ విజేతకు రూ.5 కోట్లు .ఫైనల్ మ్యాచ్లో ఓడిన జట్టుకు రూ.3 కోట్లు.రంజిత్ ట్రోఫీ సెమిస్( Ranji Trophy ) లో ఓడిన జట్టుకు గతంలో ఇచ్చే పారితోషకమును రెట్టింపు చేసి రూ.1 కోటి రూపాయలు గా చేసింది.దులీప్ ట్రోఫీ ( Duleep Trophy )విజేతకు రూ.1 కోటి రూపాయలు.రన్నరప్ కు గతంలో రూ.15 లక్షలు గా ఉన్న పారితోషకాన్ని రూ.50 లక్షలకు పెంచారు.
ఇక దేవధర్ ట్రోఫీ లో పారితోషకం గతంలో విజేతకు రూ.25 లక్షలు, రన్నరప్ కు రూ.15 లక్షలు ఇస్తుండగా.భారీగా పెంచి విజేతకు రూ.40 లక్షలు, రన్నరప్ కు రూ.20 లక్షలు గా పెంచారు.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లో పారితోషకం గతంలో విజేతలకు రూ.25 లక్షలు, రన్నరప్ కు రూ.10 లక్షలు ఇస్తుండగా.భారీగా పెంచి విజేతకు రూ.80 లక్షలు, రన్నరప్ కు రూ.40 లక్షలు గా పెంచారు.
మహిళల విషయానికి వస్తే సీనియర్ మహిళల టీ 20 ట్రోఫీలో గతంలో పారితోషకం విజేతకు రూ.5 లక్షలు, రన్నరప్ కు రూ.3 లక్షలు గా ఇచ్చేవారు.తాజాగా విజేతకు రూ.40 లక్షలు, రన్నరప్ కు రూ.20 లక్షలు గా పెంచారు.
సీనియర్ మహిళల వన్డే ట్రోఫీలో గతంలో విజేతకు రూ.6 లక్షలు, రన్నరప్ కు రూ.3 లక్షలు ఇచ్చేవారు.తాజాగా విజేతకు రూ.50 లక్షలు, రన్నరప్ కు రూ.3 లక్షలు గా పెంచారు.