రివ్యూ :'డిస్కోరాజా' అయినా రవితేజకు సక్సెస్‌ ఇచ్చాడా?

గతంలో మినిమం గ్యారెంటీ హీరో అంటూ పేరు దక్కించుకున్న రవితేజ ఇప్పుడు సక్సెస్‌ కోసం పరితపిస్తున్నాడు.గత కొన్నాళ్లుగా రవితేజ ఏం చేసినా కూడా ఫ్లాప్‌.

మద్యలో రాజాది గ్రేట్‌ తప్ప అంతకు ముందు.ఆ తర్వాత అన్ని కూడా నిరాశ పర్చాయి.

దాంతో రవితేజ సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు.సినిమాల సంఖ్య కూడా తగ్గించాడు.

ఈ చిత్రంపై చాలా నమ్మకంతో ఉన్న రవితేజకు ఇదైనా సక్సెస్‌ను తెచ్చి పెట్టిందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

లడఖ్‌ లో మంచులో కూరుకు పోయిన వాసు(రవితేజ)ను గుర్తించి ఒక రీసెర్చ్‌ సెంటర్‌కు తీసుకు వెళ్తారు.అక్కడ బ్రెయిన్‌ డెడ్‌ అయ్యిందని గుర్తిస్తారు.

Advertisement

ఆ రీసెర్చ్‌ సెంటర్‌ లో వెన్నెల కిషోర్‌ ఇంకా తన్య హోప్‌లు పలు ప్రయోగాలు చేసి వాసును బతికిస్తారు.అయితే వాసుకు గతం ఏదీ గుర్తు ఉండదు.

ఆ సమయంలో ఒక ఎంపీతో గొడవ వల్ల ఫేమస్‌ అయ్యి తన వారిని కలుసుకుంటాడు.అదే సమయంలో డిస్కోరాజా(రవితేజ) గురించి కూడా తెలుస్తుంది.

ఇంతకు వాసుకు డిస్కో రాజాకు సంబంధం ఏంటీ? వాసును చంపి లడఖ్‌ మంచు కొండల్లో పడేసింది ఎవరు? ఇలాంటి ప్రశ్నలన్నింటికి సమాధానం తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల నటన :

రవితేజ చాలా రోజుల తర్వాత మాంచి ఎనర్జిటిక్‌ పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.చాలా కాలం తర్వాత రవితేజ ఫ్యాన్స్‌కు మాంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ దక్కిందని చెప్పుకోవచ్చు.

ఆ మాస్‌ డైలాగ్స్‌ మరియు కామెడీ టైమింగ్‌తో మరోసారి కిక్‌ ఇచ్చాడు.రవితేజ నుండి గత కొంత కాలంగా అభిమానులు ఏదైతే ఆశిస్తున్నారో అవి ఈ చిత్రంలో ఉన్నాయి.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ...క్లారిటీ ఇచ్చిన టీమ్!

అయితే మొహంపై కాస్త వయసు తాలూకు ముడతలు కనిపిస్తున్నాయి.వయసు మీద పడ్డట్లుగా అనిపిస్తుంది.

Advertisement

కాని ఎనర్జి మాత్రం అదే విధంగా ఉంది.

ఇక హీరోయిన్స్‌గా నటించిన నభ నటేష్‌.పాయల్‌ రాజ్‌ పూత్‌కు పెద్దగా స్క్రీన్‌ స్పేస్‌ దక్కలేదు.వారిద్దరు కూడా పాటల కోసం అన్నట్లుగానే ఉన్నారు.

ఇక తన్యహోప్‌ కూడా పెద్దగా నటించే అవకాశం దక్కించుకోలేదు.వెన్నెల కిషోర్‌ కామెడీ బాగుంది.

బాబీ సింహా నటనతో సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు.ఇక మిగిలిన పాత్రల్లో నటించిన వారు వారి పాత్రల పరిధిలో నటించి మెప్పించారు.

టెక్నికల్‌ :

థమన్‌ ఈ సినిమాకు పాటలు అందించాడు.ఆయన అందించిన పాటలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

అందులో రెండు మూడు పాటలు ఆకట్టుకున్నాయి.ఇక బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తో కూడా థమన్‌ ఆకట్టుకున్నాడు.

కొన్ని సైన్స్‌ ఫిక్చన్‌ సీన్స్‌ సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగుంది.సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.

కొన్ని సీన్స్‌ సినిమాటోగ్రఫీ పనితనం వల్ల హైలైట్‌ అయ్యాయి.లడఖ్‌ అందాలను బాగా చూపించారు.

దర్శకుడు స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది.ఎడిటింగ్‌ బాగానే ఉంది.

కాని సెకండ్‌ హాఫ్‌లో కొన్ని సీన్స్‌ను ఇంకాస్త ట్రిమ్‌ చేస్తే బాగుండేది.నిర్మాణాత్మక విలువలు కథానుసారంగా బాగున్నాయి.

విశ్లేషణ :

రవితేజ నుండి ప్రేక్షకులు ఏదైతే ఆశిస్తున్నారో అదే ఈ చిత్రంలో దర్శకుడు విఐ ఆనంద్‌ చూపించాడు అనడంలో సందేహం లేదు.సోషియో ఫాంటసీ సినిమా అనగానే ఓ స్థాయిలో అంచనాలు పెరిగాయి.

అయితే పూర్తి స్థాయిలో ఇది సోషియో ఫాంటసీ సినిమా కాదు.చనిపోయిన వ్యక్తిని బతికించే కాన్సెప్ట్‌ కొత్తగా ఉంది.

దీన్ని గతంలో కొందరు చూపించినా కూడా ఇది చూపించిన తీరు బాగుంది.స్క్రీన్‌ప్లేలో రీసెర్చ్‌ సెంటర్‌ సీన్స్‌ను ఇంకాస్త ఇన్వాల్వ్‌ చేసి ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేది.

కాన్సెప్ట్‌ బాగుంది.దాన్ని ఇంకా బెటర్‌గా చూపించే అవకాశం ఉన్నా కూడా దర్శకుడు పూర్తి స్థాయిలో సక్సెస్‌ కాలేక పోయాడని చెప్పుకోవచ్చు.

అయినా కూడా రవితేజ ఫ్యాన్స్‌తో పాటు అందరిని కూడా మెప్పించగల సత్తా ఈ చిత్రానికి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్లస్‌ పాయింట్స్‌ :

రవితేజ, హీరోయిన్స్‌ గ్లామర్‌, పాటలు, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, కథ, డిస్కోరాజా పాత్ర

మైనస్‌ :

కొన్ని సీన్స్‌ లాజిక్‌ లేకుండా ఉన్నాయి, కొన్ని సీన్స్‌ సాగతీసినట్లుగా ఉన్నాయి, ఆశించిన స్థాయిలో కామెడీ లేదు.

బోటమ్‌ లైన్‌ :

డిస్కోరాజాతో మాస్‌రాజా ఈజ్‌ బ్యాక్‌

రేటింగ్‌ :

3.0/5.0

.

తాజా వార్తలు