తిరుమలలో వైభవంగా రథసప్తమి భారీగా భక్తుల రద్దీ.. ఆ సేవలు రద్దు..

తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఎంతో ఘనంగా వైభవంగా జరుగుతున్నాయి.

సూర్యప్రభ వాహనం పై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు.

ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి రోజు ప్రత్యక్ష దైవం సూర్య నారాయణడి జన్మదినాన్ని పురస్కరించుకొని రథసప్తమి వేడుకలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది.ఈ రోజు శ్రీవారు సప్త వాహనాలపై దర్శనం ఇవ్వమన్నారు.

శ్రీ మల్లప్ప స్వామి వారు సూర్య ప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వ భూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం.ఈ నేపథ్యంలో శ్రీ వారు భక్తులు రథసప్తమి వేడుకలను మినీ బ్రహ్మోత్సవాలుగా భావిస్తారు.

స్వామి వారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో తిరుమల క్షేత్రానికి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు.రథసప్తమి సందర్భంగా ఈ రోజు సప్త వాహనాలపై శ్రీవారి దర్శనం నేపథ్యంలో తిరుమల భక్తులతో భారీ రద్దీ ఏర్పడింది.

Advertisement

ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్నారు.దీని వల్ల తిరుమల లో టిటీడి భారీ ఏర్పాట్లను చేసింది.భక్తుల కోసం మాడవీధుల్లో, గ్యాలరీలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, అన్న పానీయాలు చేస్తున్నారు.

రద్దీకి తగినంత విధంగా అక్కడక్కడ తాత్కాలిక షెడ్లు కూడా ఏర్పాటు చేశారు.అయినా కూడా భక్తులకు వసతి సదుపాయాలు కష్టమైపోయాయి.

ఎందుకంటే చలిలోనే స్వామివారి దర్శనం కోసం ఆరుబయట భక్తులు వేచి ఉన్నారు.

రథసప్తమి సందర్భంగా టిటిడి వీఐపీ బ్రేక్,ఆర్జిత సేవలు జారీనీ రద్దు చేసింది.భక్తులకు అందుబాటులో స్వామివారి ప్రసాదం 4 లక్షల లడ్డూలను తయారు చేసి ఉంచుకుంది.తిరుమలలో రథసప్తమి పర్వదినాన్ని క్రీస్తు శకం 1564 నుంచి జరుగుతున్నట్లుగా శాసన ఆధారాలు ఉన్నాయి.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
శరత్ బాబు గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం

సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారిని వేంచేపు చేస్తారు.

Advertisement

తాజా వార్తలు