ఫిల్మ్ ఫేర్ చేసిన ట్వీట్ పై సెటైర్ వేసిన రానా..!

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రానా దగ్గుబాటి వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

ప్రస్తుతం రానా అరణ్య సినిమా పూర్తి చేసి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.

అరణ్య సినిమాకు తమిళ డైరెక్టర్ ప్రభు సాలొమోన్ దర్శకత్వం వహించారు.ఈ సినిమా అన్ని సినిమాల్లా కాకుండా కాస్త డిఫెరెంట్ గా ఉంటుంది.

ఈ సినిమా ఏనుగులకు మనిషికి మధ్య జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.ఇప్పటికే రిలీజైన ట్రైలర్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమా మార్చి 26 న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ రెడీగా ఉంది.ఈ సినిమాలో శ్రీయ, సామ్రాట్, విష్ణు విశాల్, జోయా హుస్సేన్ లు కీలక పాత్రలో నటించారు.

Advertisement
Rana-satires On Filmfare About Aranya Rana Satires On Filmfare About Aranya, Ar

ఈ నేపథ్యంలో రానా ఈ సినిమా ప్రమోషన్స్ పెంచారు.అరణ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

Rana-satires On Filmfare About Aranya Rana Satires On Filmfare About Aranya, Ar

ఇది ఇలా ఉండగా ఫిల్మ్ ఫేర్ సంస్థ తాజాగా ఒక ట్వీట్ చేసింది.ఆ ట్వీట్ కోసం రానా అరణ్య సినిమాలోని ఒక ఫోటోను వాడుకున్నారు.అరణ్య సినిమాలోని ఫోటోను షేర్ చేస్తూ కరోనా గురించిన ట్వీట్ చేసింది.

కరోనా మళ్ళీ మొదలైన విషయం మనందరికీ తెలిసిందే.రెండో దశకు చేరుకున్నామని డాక్టర్లు చెబుతుంటే మా రియాక్షన్ ఇలా ఉంటుందని అరణ్య సినిమా లోని ఫోటోను షేర్ చేసారు.

ఇది చూసిన రానా ఈ పోస్ట్ పై కౌంటర్ వేసాడు.ఫిల్మ్ ఫేర్ వారు షేర్ చేసిన పోస్ట్ లో రానా పేరు తప్పుగా రాసారు.

వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!

ఇది చుసిన రానా స్పందించాడు.మీరు నా పేరును తప్పుగా రాసిన ప్రతి సారి నా రియాక్షన్ కూడా ఇలానే ఉంటుంది అంటూ అదే ఫోటోను షేర్ చేసాడు.

Advertisement

ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.రానా అరణ్య సినిమాతో పాటు విరాట పర్వంతో పాటు పవన్ కళ్యాణ్ తో కూడా ఒక సినిమా చేస్తున్నాడు.

తాజా వార్తలు