చతురంగవెట్టై-2 రీమేక్ నే రవితేజ కోసం కొత్తగా

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం క్రాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు.ఈ షూటింగ్ చివరిదశలో ఉంది.

ఈ సినిమా తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమాని రవితేజ సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్నాడు.ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ రవితేజకి జోడీగా నటిస్తున్నారు.

అందులో సీరత్ కపూర్ తో పాటు, నభా నటేష్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.ఇక ఈ సినిమాలో కేథరీన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది అనే టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమాని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో తమిళ సూపర్ హిట్ మూవీకి రీమేక్ అనే మాట ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది.

Advertisement

అరవింద్ స్వామి, త్రిష మెయిన్ లీడ్ లో తెరకెక్కిన చతురంగవెట్టై 2 కి ఈ మూవీ రీమేక్ అని తెలుస్తుంది.మూడేళ్ళ క్రితం సిద్ధమైన ఆ సినిమా ఇప్పటికి రిలీజ్ కి నోచుకోలేదు.

అయితే ఆ సినిమా రీమేక్ రైట్స్ ని నిర్మాతలు కొనుగోలు చేసినట్లు సమాచారం.ఆ సినిమా కథని అలాగే రీమేక్ చేయకుండా మెయిన్ థీమ్ ని ఉంచుకొని రవితేజకి సరిపోయే విధంగా పూర్తి స్క్రీన్ ప్లే మార్చేసినట్లు సమాచారం.

ఒరిజినల్ లో అరవింద్ స్వామి పాత్ర నెగిటివ్ షేడ్స్ లో సీరియస్ గా ఉంటుంది.అయితే రవితేజకి అది వర్క్ అవుట్ అవ్వదు కాబట్టి, క్యారెక్టరైజేషన్ మార్చేసి నెగిటివ్ షేడ్స్ లో ఫుల్ కామెడీ యాంగిల్ లో ప్రెజెంట్ చేసి స్క్రిప్ట్ ని రమేష్ వర్మ సిద్ధం చేసాడని, ఈ వెర్షన్ నచ్చే రవితేజ అతనికి ఒకే చెప్పాడని తెలుస్తుంది.

నవంబర్ లో ఈ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టె అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు