నెట్ ఫ్లిక్స్ తో చరణ్ డీల్..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం తాను నటించిన ఆర్.ఆర్.

ఆర్ రిలీజ్ కు రెడీ అవుతుండగా నెక్స్ట్ చేస్తున్న శంకర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.శంకర్, చరణ్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో రాబోతుంది.

ఈ సినిమా తర్వాత గౌతం తిన్ననూరితో చరణ్ సినిమా ఉంటుందని తెలిసిందే.ఇదిలాఉంటే ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ చరణ్ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని చూస్తుంది.

హాలీవుడ్ లో వరుస వెబ్ సీరీస్ లతో సత్తా చాటుతున్న నెట్ ఫ్లిక్స్ రాం చరణ్ తో పాన్ ఇండియా రేంజ్ లో వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తున్నారట.ఆల్రెడీ తెలుగులో సూపర్ హీరో హిందీలో కూడా తుఫాన్ సినిమా తీశాడు.

Advertisement

ఆర్.ఆర్.ఆర్ తో బాలీవుడ్ లో కూడా చరణ్ కి క్రేజ్ ఏర్పడుతుంది.అందుకే నెట్ ఫ్లిక్స్ చరణ్ తో భారీ డీల్ సెట్ చేసుకుందని అంటున్నారు.

అయితే ఇప్పటికే డిస్నీ హాట్ స్టార్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న రాం చరణ్ నెట్ ఫ్లిక్స్ లో సీరీస్ చేస్తాడా అన్న డౌట్స్ కూడా ఉన్నాయి.మరి దీనికి సంబందించిన మరిన్ని డీటైల్స్ తెలియాల్సి ఉంది.

చరణ్ తన ఫోకస్ మొత్తం పాన్ ఇండియా ఇమేజ్ మీద పెట్టాడు.అందుకే నెట్ ఫ్లిక్స్ ప్రపోజల్స్ కి దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు