భక్తులతో రద్దీగా మారిన రాజన్న ఆలయం..

రాజన్న సిరిసిల్ల జిల్లా:దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి వారి క్షేత్రం సోమవారం కావడంతో భక్తజనసంద్రంగా మారింది.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా తరలి తరలివచ్చిన భక్తులతో అలయం రద్దీగా మారింది.

క్యూలైన్లు, ఆలయ పరిసరాలు కిక్కిరిసి పోయాయి.ఆలయం శివనామస్మరణతో మార్మోగింది.

ఎటు చూసినా భక్తుల కోలాహలం నెలకొంది.స్వామి వారి దర్శనానికి దాదాపు మూడు గంటలు పట్టింది.

ఆలయ ధర్మగుండం భక్తజన సందోహంగా మారింది.ధర్మగుండంలో పుణ్య స్నానాలాచరించిన భక్తులు రాజన్నను దర్శించుకున్నారు.

Advertisement

స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులను కుటుంబ సమేతంగా చెల్లించుకుంటున్నారు.

నేరాల నియంత్రణకు గ్రామాల్లో,పట్టణాల్లో ముమ్మరంగా పెట్రోలింగ్, బిట్స్ నిర్వహించాలి.
Advertisement

Latest Rajanna Sircilla News