ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ : ఆర్ఆర్ఆర్‌ మూవీ ట్రైలర్ ఎప్పుడు? ఎక్కడ?

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.

డిసెంబర్ నెల చివరి వరకు సినిమా ఫస్ట్‌ కాపీ రెడీ అవ్వబోతుంది.

డిసెంబర్‌ మొదటి వారంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయని సమాచారం అందుతోంది. ట్రైలర్‌ రిలీజ్ కార్యక్రమంను భారీగా నిర్వహించి సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ట్రైలర్‌ విడుదల కార్యక్రమం ముంబయిలో భారీ ఎత్తున నిర్వహించబోతున్నారట. డిసెంబర్‌ 5వ తారీకున ఈ కార్యక్రమం ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి.

సాదారణంగా సినిమా విడుదలకు వారం రెండు వారాల ముందు ట్రైలర్ ను విడుదల చేస్తారు.కాని ఈ సినిమా విషయంలో మాత్రం రివర్స్ అవుతోంది.

Advertisement

ట్రైలర్‌ ను నెల కంటే ఎక్కువ రోజుల ముందుగానే విడుదల చేయబోతున్నారు.

ప్రస్తుతం సినిమా ట్రైలర్‌ ఫినిషింగ్ లో ఉందట.ట్రైలర్‌ చూపించి సినిమా పై అంచనాలు మరింతగా పెంచేలా మేకర్స్ ప్లాన్‌ చేశారని తెలుస్తోంది.టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ఈ సినిమాను భారీ ఎత్తున ప్రమోట్ చేసేందుకు గాను ప్రణాళిక సిద్దం చేశారు.

దేశ విదేశాల్లో ఈ టీజర్ ను విడుదల చేస్తామని చెబుతున్నారు.రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లు టార్గెట్ గా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యి దాదాపుగా నాలుగు ఏళ్లు అవుతుంది.

అప్పటి నుండి ఇప్పటి వరకు సినిమా పీక్స్‌ అంచనాలు చేరాయి.బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్ మరియు అజయ్ దేవగన్ లు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ లు కొమురం భీమ్ మరియు అల్లూరిల పాత్రల్లో కనిపించబోతున్నారు. సంక్రాంతికి జనవరి 7న ఈ సినిమా రాబోతున్న విషయం తెల్సిందే.

Advertisement

తాజా వార్తలు