మళ్లీ తడబడుతున్న జక్కన్న.. రిలీజ్ డేట్‌పై ఇంత ఆందోళనా?

దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి చిత్రం తరువాత తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి.

ఇక ఈ సినిమాలోని రామ్ చరణ్ లుక్‌ను ఇటీవల రిలీజ్ చేయగా, తారక్ ఫస్ట్ లుక్‌ను త్వరలోనే రిలీజ్ చేసేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అయ్యింది.అయితే ఈ సినిమాను తొలుత జూలై 31న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.

కానీ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో 2021 జనవరి 8న రిలీజ్ చేస్తామని జక్కన్న బల్లగుద్ది మరీ చెప్పాడు.కానీ ఇప్పుడు అది కూడా సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు.

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోయింది.ఇప్పట్లో షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు.

Advertisement

దీంతో ఈ సినిమాను వచ్చే జనవరిలో రిలీజ్ చేస్తారా అనే సందేహం సర్వత్రా నెలకొంది.కాగా ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయలేమని చిత్ర నిర్మాత డివివి దానయ్య కుండ బద్దలు కొట్టాడు.

దీంతో ఈ సినిమాను 2021 ఏప్రిల్ 28న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.కానీ అది కూడా సాధ్యం అవుతందో లేదో అని ఈ సినిమాను ఏప్రిల్-జూన్ నెలల మధ్యలో మూడు తేదీల్లో రిలీజ్ చేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు.

మరి ఆ మూడు తేదీల్లో ఏ తేదీన అయితే సినిమా బాగుంటుందా అని ఆయన తల పట్టుకున్నాడట.ఇంతకీ ఆ మూడు తేదీలు ఏమిటో ప్రేక్షకులకు చెబితే బాగుంటుందని సినీ విమర్శకులు అంటున్నారు.

పవన్ కళ్యాణ్ కి మద్దతుగా రామ్ చరణ్..!!
Advertisement

తాజా వార్తలు