నేడు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టీ20 మ్యాచ్ కు వర్ష గండం..!

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా( India vs Australia ) మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా నేడు తిరువనంతపురం( Trivandrum ) వేదికగా రెండో మ్యాచ్ జరగనుంది.

అయితే ఈ మ్యాచ్ కు వర్ష గండం( Rain ) ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

శనివారం తిరువనంతపురంలో వర్షం పడటం వల్ల పిచ్ ను రోజంతా కవర్లతో కప్పి ఉంచారు.నేడు కూడా తిరువనంతపురంలో వర్షం కురిసే అవకాశం ఉందని, వర్షం కారణంగా మ్యాచ్ కు అంతరాయం కలిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఒకవేళ వర్షం మ్యాచ్ కు అంతరాయం కలిగించకపోతే.ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పేసర్లకు సహకరించి అవకాశం ఉంది.కాబట్టి టాస్ గెలిచిన జట్టు కచ్చితంగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

విశాఖపట్నం వేదికగా జరిగిన తొలి టీ-20 మ్యాచ్ లో భారీ లక్ష్యాన్ని చేదించి ఆస్ట్రేలియాపై పై( Australia ) చేయి సాధించిన భారత్( India ) అదే ఊపులో నేడు జరిగే మ్యాచ్లో కూడా గెలవాలని గట్టి పట్టుదలతో ఉంది.మొదటి మ్యాచ్ లో భారత జట్టు బ్యాటింగ్ పరంగా అద్భుత ఆటనే ప్రదర్శించింది కానీ బౌలింగ్ లో మాత్రం తేలిపోయింది.

Advertisement

నేడు జరిగే మ్యాచ్లో బౌలర్లు పుంజుకొని రాణించాల్సి ఉంది.

తొలి టీ20 లో భారత జట్టును కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్( Surya Kumar Yadav ) జట్టును ముందుండి సమర్థవంతంగా నడిపించాడు.ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, రింకూ సింగ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు.రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ లతో పాటు భారత బౌలర్లు నిరాశ పరిచారు.

ముఖ్యంగా భారత జట్టు ప్రధాన పేసర్లు అర్షదీప్ సింగ్, ప్రసిధ్ధ్ కృష్ణ భారీగా పరుగులు సమర్పించుకున్నారు.స్పిన్నర్ రవి బిష్ణోయి అయితే ఓవర్ కు ఏకంగా 13.50 చొప్పున పరుగులు సమర్పించుకున్నాడు.నేడు జరిగే రెండో మ్యాచ్లో వీళ్లంతా రాణిస్తేనే.

భారత్ ఖాతాలో రెండవ విజయం చేరుతుంది.మరోవైపు ఆస్ట్రేలియా జట్టు ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ సమం చేయాలని భావిస్తోంది.

మీరు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోండి..
Advertisement

తాజా వార్తలు