తెలంగాణలో రాహుల్ పర్యటన ఖరారు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఖరారు అయింది.ఈ మేరకు రాష్ట్రానికి రానున్న ఆయన రెండు రోజులపాటు పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.

ఈ క్రమంలో నవంబర్ 1, 2వ తేదీల్లో తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు.నవంబర్ 1వ తేదీన కల్వకుర్తి, జడ్చర్ల మరియు షాద్ నగర్ లో కాంగ్రెస్ నిర్వహించనున్న సభలకు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు.

అదేవిధంగా నవంబర్ 2వ తేదీన మేడ్చల్, మల్కాజిగిరి మరియు కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ ప్రచారాన్ని నిర్వహించనున్నారు.కాగా అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

Breaking News : అగ్నికి ఆహుతైన టాటా ఏస్
Advertisement

తాజా వార్తలు