Rahul give Promise to Revanth Reddy

రాహుల్ పట్టాభిషేకం.రేవంత్ కి పెద్ద పదవి తెచ్చిపెట్టనుందా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.

కొన్ని రోజుల క్రితం.రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన టీ - టీడీపీ మాజీ నాయకుడు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ లో ఎలాంటి పదవి ఇస్తున్నారో అంటూ అనేకరకాల ఊహాగానాలు వినిపించాయి.

కొందరైతే ఏకంగా టి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇస్తారని కూడా చర్చించుకున్నారు.అదే సమయంలో టి –కాంగ్రెస్ పెద్దల్లో అయోమయం అలుముకుంది.

నిన్న కాక మొన్న వచ్చిన వ్యక్తీ .మనకంటే అనుభవంలో చిన్న వాడు అయిన రేవంత్ కి కీలక పదవి ఇస్తార అంటూ సీనియర్స్ కాంగ్రెస్ అధిష్టానం ముందు తమ గోడు వెళ్ళగక్కారట.ఈ పరిణామాల తరువాత రేవంత్ స్పీడు కొంచం తగ్గిందనే చెప్పాలి.

Advertisement

ఎందుకంటే కేసీఆర్ లాంటి భాలమైన నాయకుడిని అందులోని తెలంగాణా ముఖ్యమంత్రిని ఎదుర్కోవాలంటే వ్యక్తిగతంగా ఎంత శక్తి ఉన్నా సరే తెలంగాణలో తమ పార్టీలో సీనియర్లు కనుకా సపోర్ట్ చేయకపోతే రేవంత్ పని అంతే ఇదే విషయాన్ని గ్రహించిన రేవంత్ కూడా పార్టీలో ఇప్పుడే దూకుడు ప్రదర్శిస్తే మొదటికే మోసం వస్తుందని గ్రహించి సమయం కోసం వేచి చూస్తూ.సీనియర్ నాయకులని ప్రత్యేకంగా వెళ్లి మరీ కలుసుకుంటున్నాడు.

ఇదిలా ఉంటే త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధమైన రాహుల్ గాంధీ… తాను కాంగ్రెస్ అధినేతగా బాధ్యతలు తీసుకున్న తరువాత టీ పీసీసీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి.అదే సమయంలో రేవంత్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ లో కీలకమైన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు సైతం భావిస్తున్నారు.

అందుకే ఇప్పటి వరకు రేవంత్ కి కీలకమైన ఎటువంటి భాద్యతలని ఇవ్వలేదని తెలుస్తోంది.చాలా మంది నేతలు రేవంత్ కి కీలక పదవి ఇవ్వవద్దు అంటున్న నేపధ్యంలో.

రేవంత్ కూడా రాహుల్ పట్టాభిషేకం అయ్యేవరకూ సంయమనంగా ఉండాలని భావిస్తున్నారట.అయితే కాంగ్రెస్ లో తనకు ఏదో ఒక కీలకమైన పదవి ఇచ్చేంతవరకు కాంగ్రెస్ తరపున క్రీయాశీలకంగా వ్యవహరించకూడదనే ఉద్దేశంతో రేవంత్ ఉన్నాడు అనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
నేటి ఎన్నికల ప్రచారం: నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ .. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ అంటే ?

ఏది ఏమైనా రేవంత్ లాంటి వాళ్ళని కోరి మరీ కాంగ్రెస్ లోకి తెచ్చుకున్న రాహుల్ తెలంగాణా కాంగ్రెస్ లో చాలా కీలక పదవిని కట్టబెట్టేలా ఉన్నాడని తెలుస్తోంది.మరి ఈ విషయంలో మరింత క్లారిటీ ఉండాలి అంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు