కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు లెటర్ రాశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయి అని ఫిర్యాదు చేశారు.
పోలవరం నిర్వాసితుల పేరుతో నకిలీ అకౌంట్లు సృష్టించి డబ్బులు దోచేస్తున్నారని ఆరోపించారు.అసలైన లబ్ధిదారులకు న్యాయం జరగకుండా నకిలీ ఖాతాదారులకు.
సొమ్ము అప్ప చెపుతున్నారని దీనిపై వెంటనే కేంద్రం చర్యలు తీసుకుని కట్టడి చేయాలని కోరారు.
రివర్స్ టెండరింగ్ ద్వారా కూడా అక్రమార్కులు జరుగుతున్న పరిస్థితి ఉందని లేఖలో స్పష్టం చేశారు.
పునరావాస నిధులు .దారి మళ్లుతున్నాయి .వెంటనే కేంద్రం దీనిపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని తెలిపారు.అదే రీతిలో ఏపీ సిఐడి పోలీసులు తన పట్ల వ్యవహరించిన తీరుపై .లేఖలో స్పష్టం చేశారు.