పీవీ 'భారతరత్న'కు కేసీఆర్‌ తీర్మానం

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలంటూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయబోతున్నట్లుగా సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

పీవీ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం నేడు వాటిపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన వచ్చే నెలలో జరుగబోతున్న అసెంబ్లీ సమావేశాల సందర్బంగా పీవీ కి భారతరత్న ఇవ్వాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంకు సిఫార్సు చేయబోతున్నట్లుగా తెలియజేశారు.హైదరాబాద్‌ లో పీవీ జ్ఞాపకాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లుగా పేర్కొన్నాడు.

నెక్లేస్‌ రోడ్డుకు పీవీ జ్ఞానమార్గ్‌ అని పేరు మార్చబోతున్నారట.అలాగే హైదరాబాద్‌ లో పీవీ మెమోరియల్‌ ను ఏర్పాటు చేయనున్నట్లుగా కేసీఆర్‌ ప్రకటించారు.

తెలుగు వ్యక్తి ప్రధాని అవ్వడం పీవీనే మొదటి మరియు చివరి వ్యక్తి.అందుకే ఆయనకు మనం సముచిత గౌరవం సంపాదించి పెట్టాలని కేసీఆర్‌ భావిస్తున్నాడట.

Advertisement

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పీవీ నరసింహారావు దేశం ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పుడు తన మేదస్సుతో పరిష్కరించారు.ప్రస్తుత ఆర్థిక పరిస్థతికి ఆయన కారణం అంటూ నిపుణులు అంటూ ఉంటారు.

అందుకే ఆయనకు భారతరత్న ఇవ్వాల్సిందే అనేది కేసీఆర్‌ డిమాండ్‌.

Advertisement

తాజా వార్తలు