'పుష్ప 2' షూట్ అప్డేట్.. రామోజీ ఫిలిం సిటీలో కీలక షెడ్యూల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప ది రూల్.

ఇందులో హీరోయిన్ రష్మిక మందన్న అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

మన పుష్ప రాజ్ రాకకోసం పాన్ ఇండియా వ్యాప్తంగా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇటీవలే ఎన్నో అంచనాల మధ్య షూట్ స్టార్ట్ చేసుకున్న ఈ సీక్వెల్ అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా గ్లింప్స్, ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు.

ఈ అప్డేట్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా అంచనాలు డబల్ అయ్యాయి.పుష్ప ది రైజ్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

పుష్ప పార్ట్ 1 ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పాల్సిన పని లేదు.అందుకే ఈసారి భారీ ప్లానింగ్స్ తో ఈ సినిమాను సుకుమార్( Sukumar ) తెరకెక్కిస్తున్నాడు.ఇక ప్రజెంట్ ఈ సినిమా షూట్ గురించి క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.

Advertisement

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లేటెస్ట్ షెడ్యూల్ ను హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుపు కుంటుంది అని సమాచారం.

ఈ షెడ్యూల్ లో సుకుమార్ అల్లు అర్జున్, విలన్ గా నటిస్తున్న ఫహద్ ఫాజిల్ ( Fahadh Faasil )తో పాటు పలువురు ఇతర పత్రాలపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే చాలా భాగం పూర్తి చేసుకున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు ముగించి వచ్చే ఏడాది గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధం చేస్తున్నారు.చూడాలి ఈసారి ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో.

Advertisement

తాజా వార్తలు