పుష్ప 2 రిలీజ్ పోస్టర్ లో ఇది గమనించారా.. సుక్కూ ఆ హింట్ ఇచ్చేసాడుగా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప ది రూల్.

టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలలో ఇది ఒకటి అని చెప్పాలి.

అంతేకాదు ఇప్పుడు తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాల్లో భారీ హైప్ ఉన్న బిగ్గెస్ట్ సినిమాగా పుష్ప టాప్ లో ఉంది.

ఈ సినిమా పార్ట్ 1 ఘన విజయం సాధించడంతో పార్ట్ పై అన్ని అంచనాలు పెరిగాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా పార్ట్ 1 సౌత్ మాత్రమే కాదు నార్త్ వాళ్ళను కూడా ఆకట్టుకుంది.అందుకే ఈసారి పార్ట్ 1 ను మించి తెరకెక్కిస్తున్నారు.

ఇందులో హీరోయిన్ రష్మిక మందన్న ( Rashmika Mandanna )అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్( Devi Sri Prasad ) సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

మొదటి పార్ట్ తో మ్యూజిక్ తోనే సగం సినిమాను హిట్ చేసిన దేవి ఈసారి కూడా అదే రేంజ్ లో మ్యూజిక్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు.ఇదిలా ఉండగా నిన్న సడెన్ గా రిలీజ్ డేట్ ప్రకటించి పుష్పరాజ్ అప్పుడే తన రూలింగ్ స్టార్ట్ చేసాడు.

తాను రాబోతుంది ఎప్పుడో పోస్టర్ తో ప్రకటించాడు.

ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 15న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.దీంతో అంతా సర్ప్రైజ్ అయ్యారు.ఇక ఈ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయగా ఈ పోస్టర్ లో కేవలం పుష్పరాజ్ చేయిని మాత్రమే హైలెట్ చేసారు.

మరి ఆ చెయ్యిని ఒక్కసారి పరిశీలిస్తే ఆ చేతికి మొత్తం నాలుగైదు బంగారు బ్రేస్ లెట్స్, రాళ్ల ఉంగరాలు, వజ్రాలు పొదిగిన ఉంగరాలు ఉన్నాయి.దీంతో ఈసారి పుష్పరాజ్ ను బంగారు బాబులా చూపిస్తూ మొత్తం మెరిసిపోయేలా సుక్కు ప్లాన్ చేసాడని ఈ విధంగా హింట్ ఇచ్చాడు చర్చ జరుగుతుంది.

వైరల్ : కొడుకు కోసం ఆ తండ్రి బిర్యానీతో పడిన కష్టం.. ఎమోషనల్ స్టోరీ..
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 

చూడాలి ఈసారి పుష్పరాజ్ గెటప్, సెటప్ ఎలా ఉంటుందో.

Advertisement

తాజా వార్తలు