సలార్‌, పుష్ప 2 రిలీజ్ లపై ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ వచ్చిందోచ్‌

అల్లు అర్జున్‌ మరియు సుకుమార్‌ ల కాంబోలో రూపొందిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో తెల్సిందే.

భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న పుష్ప 2 సినిమా కూడా ఖచ్చితంగా రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను దక్కించుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు.

కేజీఎఫ్ 2 రేంజ్ లో భారీ యాక్షన్‌ ఎంటర్ టైనర్‌ మూవీగా మాస్ ఆడియన్స్ కు కనెక్ట్‌ అయ్యే విధంగా పుష్ప 2 ను రూపొందిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.వెయ్యి కోట్ల వసూళ్లు టార్గెట్‌ గా పుష్ప 2 ను రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Pushpa 2 And Salaar Movies Release Dates Updates , #salaar, Allu Arjun, Flim New

ఇక పుష్ప 2 తో పాటు సలార్‌ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఓ ఆట ఆడించేందుకు సిద్దం అవుతోంది.ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్‌ సినిమా లో ప్రభాస్ లుక్ ను చూస్తుంటే బాబోయ్ అనిపించక మానదు.

అందుకే సలార్‌ సినిమా విడుదల కోసం ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.సలార్‌ మరియు పుష్ప 2 సినిమా లు బాలీవుడ్‌ బాక్సాఫీస్ ను ఓ రేంజ్ లో కుమ్మేయడం ఖాయం అని. కేజీఎఫ్‌ 2 రికార్డులను ఈ సినిమాలు బ్రేక్ చేస్తాయని అంతా నమ్మకంగా ఉన్నారు.ఇలాంటి సమయంలో ఈ సినిమా ల యొక్క విడుదల తేదీలు చాలా ఇంట్రెస్ట్‌ గా మారాయి.

Advertisement

ఎప్పుడెప్పుడు ఈ సినిమాలు వస్తాయా అంటూ ఎదురు చూస్తున్న అభిమానులు మరియు సినీ వర్గాల వారికి సమాధానం అన్నట్లుగా యూనిట్‌ సభ్యుల నుండి ఒక క్లారిటీ వచ్చింది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లు రెండు కూడా 20 నుండి 30 రోజుల గ్యాప్ లో సమ్మర్ లో విడుదల కాబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఈ రెండు సినిమా లు బ్యాక్ టు బ్యాక్ వస్తే దేశ వ్యాప్తంగా ఉన్న మాస్ అభిమానులకు పండుగే అనడంలో సందేహం లేదు.

Advertisement

తాజా వార్తలు