పురంధేశ్వరి టీడీపీలోకి వెళ్లాలి..: మంత్రి సిదిరి

ఏపీలోని టీడీపీపై మంత్రి సిదిరి అప్పలరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ప్రభుత్వ డెయిరీని టీడీపీ నేత ధూళిపాళ్ల కబ్జా చేశారని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టడంలో టీడీపీ వారిని మించిన వారు లేరని మంత్రి సిదిరి విమర్శించారు.ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బుదరజల్లుతున్నాయన్నారు.

పశు సంవర్ధక శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్న మంత్రి సిదిరి నాదెండ్లకు అవగాహన లేక పశువుల కొనుగోలు అవినీతి అంటున్నారని మండిపడ్డారు.పశువుల కొనుగోలు బ్యాంకర్ల ద్వారా జరుగుతోందన్న ఆయన అవినీతికి తావులేదని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉన్న మద్యం బ్రాండ్స్ చంద్రబాబు అనుమతులు ఇచ్చినవేనని తెలిపారు.దీనిపై పురంధేశ్వరికి డౌట్స్ ఉంటే చంద్రబాబును అడగాలన్నారు.

Advertisement

మద్యం బ్రాండ్స్ పై సీబీఐ విచారణ వేయించుకోవచ్చని చెప్పారు.బీజేపీలో ఎందుకు, టీడీపీలోకి పురంధేశ్వరి వెళ్లాలని సూచించారు.

శ్రీవారి ఆలయంలో శ్రీలీల బుగ్గగిల్లిన తమన్... ఆలయంలో ఈ పనేంటంటూ ట్రోల్స్?
Advertisement

తాజా వార్తలు