వీపును గోకమని తెగ బతిమిలాడుతున్న గుర్రం.. క్యూట్ వీడియో వైరల్..

ఒకరికొకరు కమ్యూనికేట్ కావడానికి మాటలు అవసరం లేదు.జస్ట్ కొన్ని సైగలతో చాలా విషయాలను ఇతర వ్యక్తులకు తెలియజేయవచ్చు.

 A Man Scratching Horses Viral On Social Media , Viral Video, Latest News, Trend-TeluguStop.com

కుక్కలు, పిల్లులు ఇంకా ఇతర మూగ జంతువులు మనుషులతో ఇలానే కమ్యూనికేట్ అవుతాయి.దీనినే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటారు.

ఈ రకం కమ్యూనికేషన్ ద్వారా జంతువులు మనుషులకు ఎన్నో విషయాలను తెలియజేస్తాయి.తమకు కావలసిన పనులను కూడా చేయించుకుంటాయి.

తాజాగా ఒక చిన్న గుర్రం( Horse ) కూడా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ద్వారా తన వీపును గోకమని, వీపును నిమరాలని యజమానిని బతిలాడుకుంది.దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది.

సైన్స్ గర్ల్‌ అనే ట్విట్టర్( Twitter ) పేజీ షేర్ చేసిన ఈ వీడియోకు ఒక కోటి 73 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.ఆ వీడియో ఓపెన్ చేస్తే మనుకు ఒక చిట్టి గుర్రం కనిపిస్తుంది.దాని వీపు వెనుక భాగాన్ని ఒక మహిళ గోకుతూ కనిపించింది.కొద్దిసేపు గోకిన తర్వాత ఆమె ఆపేసింది.వెనక్కి కూడా వెళ్ళింది అయితే ఆ గుర్రం తనకు ఇంకా ఆ గోకటం కావాలని ఆమె వద్దకు పరుగు పరుగున వెళ్ళింది.నాపై తన వీపును చూపించి కమాన్ ఇంకొద్దిసేపు గోకు అని అడిగినట్లు ప్రవర్తించింది.

అలా చాలా సార్లు ఇది ఆ యువతి చేత స్క్రాచ్ చేయించుకుంది.ఈ వీడియో చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందని చెప్పవచ్చు.

గుర్రాలకు వెనుక గీకించుకోవడం అంటే చాలా ఇష్టం అని ఒక వ్యక్తి సరదాగా కామెంట్ చేశాడు.ఇంకా దీన్ని చూసి నెటిజన్లు ఇది చాలా అద్భుతంగా ఉందని, ఇవి భలేగా అడిగి మరీ స్క్రాచ్( Scratching ) చేయించుకుంటున్నాయి కదా అని ఇంకొందరు అంటున్నారు.దీనిని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube