టాలెంట్ తో సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో సుహాస్ ( Suhas )ఒకరు కాగా సుహాస్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఒకప్పుడు 3,000 రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకున్న సుహాస్ ఇప్పుడు 3 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగారు.
కథ అద్భుతంగా ఉన్న సినిమాలను సుహాస్ ఎంపిక చేసుకుంటూ విజయాలను అందుకుంటున్నారు.
సుహాస్ నటిస్తే సినిమా మినిమం గ్యారంటీ అని ఫ్యాన్స్ సైతం ఫిక్స్ అవుతున్నారు.
ఎంతో టాలెంట్ ఉన్న సుహాస్ చిన్నచిన్న పాత్రల్లో నటించి ఒక్కో మెట్టు పైకి ఎదిగారు.మొదట చిన్నచిన్న కామెడీ వీడియోలు చేసిన సుహాస్ ఎంతో కష్టపడి స్టార్ స్టేటస్ ను అందుకున్నారు.
టీఎన్నార్ ఇంటర్వ్యూ( TNR interview ) ద్వారా సుహాస్ ఒకింత పాపులర్ అయ్యారు.సుహాస్ కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు.

టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీకి చెందిన స్టార్ నిర్మాతలు సైతం సుహాస్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.సుహాస్ నటించిన అంబాజిపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ ( Ambajipeta Marriage Band Movie )త్వరలో రిలీజ్ కానుంది.ఈ సినిమా కోసం సుహాస్ చాలా కష్టపడ్డారని ఈ సినిమాలో ట్విస్టులు ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం అందుతోంది.సుహాస్ రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రాజెక్ట్ లను ఎంచుకుంటారో చూడాలి.

సుహాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.కథ నచ్చితే సుహాస్ మల్టీస్టారర్స్ లో కూడా నటిస్తారేమో చూడాల్సి ఉంది.సుహాస్ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.సుహాస్ రాబోయే రోజుల్లో ఏ రేంజ్ కు ఎదుగుతారో చూడాల్సి ఉంది.సుహాస్ కామెడీ టైమింగ్ కూడా ఎంతోమందిని ఆకట్టుకుంటోంది.సుహాస్ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాల్సి ఉందని మరి కొందరు చెబుతుండటం గమనార్హం.







