కెనడా : ‘‘పంజాబ్ 95’’ మూవీకి షాక్.. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ స్క్రీనింగ్ నుంచి తొలగింపు

కెనడాలోని ‘‘టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’’ (టీఐఎఫ్ఎఫ్)( TIFF ) 2023 ఎడిషన్ నుంచి భారతీయ చలన చిత్రం ‘‘పంజాబ్ 95’’ను( Punjab 95 ) తప్పించడం వివాదానికి దారితీసింది.

హనీ ట్రెహాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దిల్జిత్ దోసాంజ్( Diljit Dosanjh ) నటించారు.

ఈ సినిమాను టీఐఎఫ్ఎఫ్ నుంచి తొలగించినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి.అయితే ఫెస్టివల్ నుంచి పంజాబ్ 95 ను తప్పించడం వెనుక గల కారణాలు తెలియాల్సి వుంది.

అలాగే టీఐఎఫ్ఎఫ్ వెబ్‌సైట్ నుంచి , జూలై 24న జారీ చేసిన ట్వీట్‌ సహా ఈ సినిమాకు సంబంధించిన మొత్తం వివరాలను తొలగించారు.

1995లో అదృశ్యమైన పంజాబ్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా( Jaswant Singh Khalra ) జీవితం ఆధారంగా పంజాబ్ 95 చిత్రాన్ని తెరకెక్కించారు.ఒక దశాబ్ధం తర్వాత ఖల్రా హత్యకు ఆరుగురు పంజాబ్ పోలీసులు కారణమని, వారిని దోషులుగా నిర్ధారించబడ్డారు.పంజాబ్‌లో ఖలిస్తాన్ ఉద్యమం( Khalistan ) ఉధృతంగా సాగుతున్న సమయంలో రాష్ట్రంలో వేలాది మంది అదృశ్యమైన విషయంపై ఖల్రా పోరాడారు.

Advertisement

అటు పంజాబ్ 95 చిత్రం ఇప్పటికే భారతదేశంలోనూ ఇబ్బందులను ఎదుర్కొంటోంది.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ)( CBFC ) సైతం సెన్సార్ సర్టిఫికెట్‌ను జారీ చేయడానికి దాదాపు 7 నెలల సమయం తీసుకుందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

దీనికి కూడా ఎన్నో కట్‌లు, మరెన్నో సూచనలు సెన్సార్ బోర్డ్ చేసింది.

ఇక ‘‘Ghallughara’’ అనే పదాన్ని వాడకుండా హెచ్చరికలు చేసింది.చరిత్రలో సిక్కుల ఊచకోతతో పాటు 1984లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల సమయంలో ఆ పేరును ఉపయోగించారు.మీడియా నివేదికల ప్రకారం ‘‘పంజాబ్ 95’’ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు హింసను ప్రేరేపించేలా వున్నాయని, భారతదేశ సమగ్రతను, విదేశాలతో సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని సీబీఎఫ్‌సీ భావించింది.

అలాగే ఈ సినిమా సిక్కు యువతపై( Sikhs ) దుష్ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంది.ఈ నేపథ్యంలో పంజాబ్ 95ను టీఐఎఫ్ఎఫ్ ఫెస్టివల్ నుంచి తొలగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు