Ys Sharmila Ysrtp : ప్రజా ప్రస్థానం : అరుదైన ఘనత సాధించిన షర్మిల

వైఎస్సార్ తెలంగాణ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించి తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు ఆ పార్టీ అధినేత వైఎస్ షర్మిల.

వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా, ఆయన స్థాయిలో చరిష్మా ఉన్న నేతగా ఎదిగేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారు.

అయితే షర్మిల ఏపీకి చెందిన వ్యక్తి అంటూ అనేక విమర్శలు వచ్చినా.  తాను తెలంగాణ కోడల్ని అంటూ చెబుతూనే తాను పుట్టి పెరిగిందంతా ఇక్కడే అంటూ షర్మిల తనపై వస్తున్న రాజకీయ విమర్శలకు చెక్ పెట్టారు.

  ఇక ప్రజా ప్రస్థానం పేరుతో తెలంగాణ అంతట ఆమె పాదయాత్ర పేరుతో పర్యటిస్తున్నారు.గతంలో తన అన్న జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర మధ్యలో నిలిచిపోవడంతో షర్మిల ఆయాత్రను కొనసాగించి అలుపెరగకుండా పాదయాత్ర నిర్వహించారు.

ప్రస్తుతం తెలంగాణలో ఆమె చేపట్టిన పాదయాత్ర నేటికీ మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.దీంతో తెలంగాణలో ఈ ఘనత సాధించిన మహిళ నాయకురాలుగా షర్మిల అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.

Advertisement

ఈ పాదయాత్ర ద్వారా జనాల్లోకి పార్టీని తీసుకువెళ్లి బలోపేతం చేసే విధంగా షర్మిల ప్రయత్నిస్తున్నారు.గత సంవత్సరం అక్టోబర్ 20వ తేదీన షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రను రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభించారు. 

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇదే చోటు నుంచి పాదయాత్రను ప్రారంభించడంతో, అదే సెంటిమెంట్ తో షర్మిల కూడా యాత్రను మొదలుపెట్టారు.ఇక తన పాదయాత్రలో టిఆర్ఎస్ ను ప్రధానంగా టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు.తెలంగాణలో నెలకొన్న ప్రధాన సమస్యలను ప్రస్తావిస్తూ మంత్రులను , సీఎం కేసీఆర్ ను నిలదీస్తూ తన క్రెడిబులిటీ పెంచుకుంటూ పార్టీని బలోపేతం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

కేవలం పాదయాత్రతో సరిపెట్టకుండా,  మధ్య మధ్యలో సభలు నిర్వహిస్తూ వివిధ సమస్యలపై నిరసన దీక్షలు చేపడుతూ , వినూత్నంగా ప్రజాప్రస్థానం యాత్రను షర్మిల కొనసాగిస్తున్నారు.ముఖ్యంగా నిరుద్యోగులు, మహిళలు, రైతులు యువతను టార్గెట్ చేసుకొని ఆమె ముందుకు వెళ్తున్నారు.

   .

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?
Advertisement

తాజా వార్తలు