జీవిత, రాజశేఖర్ పై కేసు నమోదు.. మోసం చేశారంటూ నిర్మాత వ్యాఖ్యలు

టాలీవుడ్ ప్రముఖ హీరో రాజశేఖర్, అతని భార్య జీవితలపై ఓ నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేశారు.అంతే కాక వారిపై కేసు నమోదు చేశారు.

రాజశేఖర్ తో PSV గరుడవేగ సినిమా నిర్మించిన జ్యో స్టార్ ఫిలిం ప్రొడక్షన్ ఫౌండర్ కోటేశ్వరరాజు, మేనేజింగ్ డైరెక్టర్ హేమ వారిపై కేసు నమోదు చేశారు.దీనిపై మీడియాతో మాట్లాడారు.

జ్యో స్టార్ ఫిలిం ప్రొడక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ హేమ మాట్లాడుతూ.”జీవిత, రాజశేఖర్ చాలా మంచి మనుషులుగా బయటి ప్రపంచంలో చలామణి అవుతున్నారు.

రాజశేఖర్ తండ్రి వరదరాజన్ వల్ల మేము వారికి పరిచయం అయ్యాం.రాజశేఖర్, జీవితల వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం” అని అన్నారు.

Advertisement
జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?

తాజా వార్తలు