ప్రాజెక్ట్ కే : అదిరిపోయిన ప్రభాస్ ఫస్ట్ లుక్.. ఐరన్ సూట్ లో డార్లింగ్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas )హీరోగా దీపికా పదుకొనె( Deepika Padukone ) హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ కే.

పాన్ వరల్డ్ మూవీగా టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

అందుకే రోజురోజుకూ అంచనాలు భారీగా పెరిగి పోతున్నాయి.బిగ్గెస్ట్ విజువల్ ట్రీట్ కు ప్రేక్షకుల కోసం రెడీ చేయడానికి నాగ్ అశ్విన్ రెండేళ్లుగా కష్టపడుతూనే ఉన్నాడు.

పాన్ ఇండియానే కాదు పాన్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమాపై ఇప్పుడు క్యూరియాసిటీ పెంచే పనిలో ఈయన ఉన్నాడు.అంతేకాదు ఇందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్,( Amitabh Bachchan ) దిశా పటానీ, కమల్ హాసన్ వంటి స్టార్స్ భాగం అవ్వడంతో ఈ సినిమాపై మరింత ఈగర్ గా అన్ని ఇండస్ట్రీల వారు ఎదురు చూసేలా చేస్తున్నారు.ఇదిలా ఉండగా జులై 21 కోసం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.

అందుకు కారణం అదే రోజు ఈ సినిమా నుండి టైటిల్ అండ్ టీజర్ రాబోతున్నాయి కాబట్టి.జులై 20న యూఎస్ లో, 21న ఇండియాలో ఈ సినిమా నుండి టైటిల్ అండ్ టీజర్ రాబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసారు.

Advertisement

ఇదిలా ఉండగా ఈ లోపు లోనే వరుసగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ లను ఇస్తున్నారు.నిన్నటికి నిన్న దీపికా పదుకొనె ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.

ఆమె లుక్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచగా ఇప్పుడు అసలైన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.ప్రభాస్ ఈ ఫస్ట్ లుక్ లో ఐరన్ సూట్ లో గడ్డంతో డిఫరెంట్ స్టైల్ లో ఉన్నాడు.ఎంతగానో ఎదురు చూసిన లుక్ బయటకు రావడంతో ఫ్యాన్స్ అంత ఉత్సాహంగా ఉన్నారు.

ఎట్టకేలకు ఇన్నాళ్లకు ప్రాజెక్ట్ కే లో డార్లింగ్ ఎలా ఉండబోతున్నాడో చూడడంతో ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు.మరి టైటిల్ అండ్ టీజర్ ఏ రేంజ్ లో అలరిస్తాయో వేచి చూడాలి.

శాన్ డియాగో కామిక్ కాన్ అనే ప్రపంచ ప్రఖ్యాత వేదికపై అట్టహాసంగా టైటిల్ అండ్ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.కాగా ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై 500 కోట్ల భారీ బడ్జెట్ తో అశ్వనీ దత్ నిర్మిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

ఇక ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు