పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా రాష్ట్రానికి ఏం చేస్తాడు...నాగ వంశీ షాకింగ్ కామెంట్స్!

సినీ నటుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రాజకీయాలలో( Politics ) కి వచ్చిన తర్వాత సినిమాలను కాస్త తగ్గించారు.

ఇక ప్రస్తుత ఈయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా( AP Deputy CM ) బాధ్యతలు తీసుకున్నారు.

ఇలా ఉప ముఖ్యమంత్రిగా 5 శాఖలకు మంత్రిగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ రాజకీయాలలో పూర్తిగా బిజీ అయ్యారు.ఈ క్రమంలోనే ఆయన కమిట్ ఆయిన సినిమా షూటింగ్స్ కూడా పూర్తి చేయలేకపోతున్నారు.

దీంతో పవన్ కళ్యాణ్ ఇక తెరపై కనిపించరేమో అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Producer Nagavamshi Sensational Comments On Pawan Kalyan Details, Pawan Kalyan,

ఇక ఈ విషయం గురించి ఇటీవల నిర్మాత నాగ వంశీ ( Producer Nagavamshi ) మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో నిర్మించిన మ్యాడ్ స్క్వేర్( Mad Square ) సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో ఆయన పవన్ సినీ కెరియర్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.ఈ సందర్భంగా నాగవంశీ మాట్లాడుతూ.

Advertisement
Producer Nagavamshi Sensational Comments On Pawan Kalyan Details, Pawan Kalyan,

పవన్ గారు సినిమా చేయాలని కోరుకోవడం కంటే ఆయన రాష్ట్రానికి దేశానికి ఏం చేస్తారని మనం ఆశించాలి.ఆయన మరింత ఉన్నత స్థాయికి ఎదిగి,ప్రజలకు మంచి చేయాలని కోరుకోవాలి అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Producer Nagavamshi Sensational Comments On Pawan Kalyan Details, Pawan Kalyan,

ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలకు కమిట్ అయ్యారు.ఈ సినిమాలు కొంతమేర షూటింగ్ పనులు జరుపుకున్న సంగతి తెలిసిందే.ఈయన నటించిన సినిమాలలో హరిహర వీరుమల్లు దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 9 న విడుదలకు సిద్ధమవుతోంది.

ఇక సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ ఇప్పటికే 80% షూటింగ్ పూర్తి చేసుకుంది.ఉస్తాద్ భగత్ సింగ్  కొన్ని ముఖ్యమైన షెడ్యూల్‌లు మిగిలి ఉన్నాయి.ఇలా పవన్ ఈ మూడు సినిమాలను పూర్తి చేసి తదుపరి ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వరని తెలుస్తుంది.

ప్రస్తుతం ఈయన పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే.

సందీప్ వంగ స్పిరిట్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ ను తీసుకుంటున్నారా..?
Advertisement

తాజా వార్తలు