ఈ దీన పరిస్థితి నుండి ఇండస్ట్రీ త్వరలోనే బయటపడుతుంది : దిల్ రాజు

ప్రెసెంట్ మన టాలీవుడ్ లో సినిమా ఇండస్ట్రీ పరిస్థితి అంతగా అనుకూలంగా లేదు అనే చెప్పాలి.

అలా అని సినిమాలు హిట్ అవ్వడం లేదు అని చెప్పడం లేదు కానీ.

సినిమా ఎంత హిట్ అయినా.ఓపెనింగ్స్ బాగానే వచ్చిన ఆ తర్వాత మాత్రం అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ రావడం లేదు.

కరోనా తర్వాతనే ఇలాంటి దీన స్థితి మన సినిమా ఇండస్ట్రీకి వచ్చింది.అంతకు ముందు హిట్ టాక్ వస్తే చాలు కలెక్షన్స్ బాగా వచ్చేవి.

కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీ బాగా కుదేలైంది.కరోనా తర్వాత టాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ మార్పులు వచ్చాయి.

Advertisement

పెరిగిన టికెట్ ధరలు మాత్రమే కాదు.మూడు వారాలు ఆగితే ఓటిటిలో చూడవచ్చులే అనే ధోరణిలో ప్రేక్షకులు ఆలోచిస్తూ ఉండడంతో థియేటర్స్ వైపు ప్రేక్షకుల అడుగులు పడడం లేదు.

కరోనా అప్పటి నుండి ప్రేక్షకులకు ఓటిటి ప్లాట్ ఫామ్ లు అలవాటు కావడంతో ప్రేక్షకులు థియేటర్ వైపు అడుగులు వేయడం లేదు.

అంతేకాదు పెద్ద సినిమాలు కూడా నెల కూడా గడవక ముందే ఓటిటిలో రిలీజ్ చేయడం వల్ల కూడా ప్రేక్షకులు థియేటర్ వైపు చూడడం లేదు.మరి ఈ పరిస్థితిపై మన టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు స్పందించారు.రిలీజ్ కు ముందు మంచి ప్రొమోషన్స్ చేస్తూ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తూ.

సినిమాలను రిలీజ్ చేస్తున్న కూడా రెవిన్యూ రాకపోవడంతో నష్టాలు తప్పడం లేదు.తాజాగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

ఈ పరిస్థితికి రెండు కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు.ముందుగా ప్రేక్షకులు అన్ని సినిమాలను అంత మనీ పెట్టి థియేటర్స్ కు వెళ్లి మరీ చూసేందుకు ఇష్టపడడం లేదు.

Advertisement

ఇందుకు ఓటిటి కూడా ప్రధాన కారణం అంటూ చెప్పుకొచ్చాడు.అయితే ఈ దీన పరిస్థితి నుండి బయట పడేందుకు సినీ పెద్దలందరూ కలిసి ఈ అంశాలపై ద్రుష్టి పెట్టినట్టు.

త్వరలోనే ఈ పరిస్థితి నుండి బయట పడతామంటూ చెప్పినట్టు తెలుస్తుంది.ఇదే నిజం అయితే మళ్ళీ మన ఇండస్ట్రీకి మంచి రోజులు రావడం ఖాయం.

తాజా వార్తలు