బాబును అలా చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది.. నటి సంచలన వ్యాఖ్యలు వైరల్!

బాలీవుడ్ నటి కవయిత్రి ప్రియ మాలిక్‌( Priya Malik ) గురించి మనందరికీ తెలిసిందే.

ఈమె బాలీవుడ్ లో పలు సినిమాల లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈమె తరచు ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.ముఖ్యంగా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

అందులో భాగంగానే తాజాగా కూడా తన బాబు గురించి ఒక విషయాన్ని చెబుతూ ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.ఆ పోస్టులో ఈ విధంగా రాసుకొచ్చింది.

నా బాబుకు తీవ్ర జ్వరం వచ్చింది.వారం రోజుల నుంచి అస్సలు తగ్గడం లేదు.

Priya Malik Four Month Old Son Zorawar Hospitalisation Details, Priya Malik, Zor
Advertisement
Priya Malik Four Month Old Son Zorawar Hospitalisation Details, Priya Malik, Zor

జూలై 20న ఆస్పత్రికి తీసుకెళ్తే 103 డిగ్రీల జ్వరం ఉందని అన్నారు.ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నాము.పారాసిటమాల్‌ ఇచ్చారు, ఇంజక్షన్స్‌ వేశారు.

ఇంకా ఏవో డ్రాప్స్‌ వేశాక ఇంటికి తీసుకొచ్చాము.బాబును అలా చూస్తే మా గుండె తరుక్కుపోయింది.

అంతా నయమైపోయిందనుకునే లోపు జూలై 22న మళ్లీ జ్వరం( Fever ) మొదలైంది.ఈసారి కూడా 102 డిగ్రీలకు చేరుకుంది.

ఆస్పత్రికి తీసుకెళ్తే అడ్మిట్‌ చేసుకున్నారు.యూరినరీ ఇన్‌ఫెక్షనే( Urinary Infection ) దీనికి కారణమై ఉండొచ్చని అన్నారు.

దారుణం.. మురికి కాలువ నీటితో కూరగాయలు కడుగుతున్న వ్యాపారి... వీడియో చూస్తే గుండెలు గుభేల్!
కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?

ఆరు నెలల వరకు తనకు తల్లిపాలే పట్టించాను.కాకపోతే ఇంటికి వచ్చినవాళ్లు వాడిని చూస్తానంటే ఎత్తుకోనిచ్చాను.

Priya Malik Four Month Old Son Zorawar Hospitalisation Details, Priya Malik, Zor
Advertisement

బహుశా అదే నేను చేసిన తప్పేమో! ఏ వాతావరణాన్నైనా తట్టుకునే శక్తి పెద్దలకు ఉంటుంది.కానీ పిల్లలకు ఉండదని డాక్టర్‌ అన్నారు.వాతావరణంలోని మార్పులే తనకు వచ్చిన జ్వరానికి ప్రధాన కారణమై ఉంటుందని అన్నారు.

అలాగే బాబును అందరి చేతికీ ఇవ్వొద్దని అన్నారు.జూలై 23న నా భర్త కరణ్‌( Karan ) బర్త్‌డే.

కానీ బాబు పరిస్థితి చూసి సెలబ్రేషన్స్‌ వాయిదా వేసుకున్నాం అని రాసుకొచ్చింది.ఈ సందర్భంగా ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు నెటిజెన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.

తాజా వార్తలు