యూకే ప్రతిపక్షనేత బరిలో భారత సంతతి మహిళా ఎంపీ

భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన దేశాల్లో యూకే( UK ) ఒకటి.మనదేశాన్ని బ్రిటీషర్లు పరిపాలించడంతో స్వాతంత్య్రానికి పూర్వం.

 Priti Patel Enters Race To Lead Uk Opposition Conservative Party Details, Priti-TeluguStop.com

స్వాతంత్య్రం తర్వాత లక్షలాది మంది భారతీయులు యూకేకు వలస వెళ్తున్నారు.డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులుగా రాణిస్తున్నారు.

నిన్న మొన్నటి వరకు బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్( Rishi Sunak ) వ్యవహరించిన సంగతి తెలిసిందే.

ఇటీవల ముగిసిన యూకే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయులు సత్తా చాటారు.

బ్రిటన్ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 26 మంది భారత సంతతి ఎంపీలు హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికయ్యారు.అలాగే తన కేబినెట్‌లో భారత మూలాలున్న లిసా నందికి( Lisa Nandi ) కల్చర్, మీడియా, క్రీడా శాఖను అప్పగించారు ప్రధాని కీర్ స్టార్మర్.

( PM Keir Starmer ) అన్నింటిలోకి పంజాబీ మూలాలున్న అభ్యర్ధులు ఈసారి స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించారు.రికార్డు స్థాయిలో 12 మంది పంజాబీ సంతతి నేతలు హౌస్ ఆఫ్ కామన్స్‌లో అడుగుపెట్టారు.

ఈ సంఖ్య 2019లో ఐదుగా ఉండేది.

Telugu Conservative, Pm Rishi Sunak, Lisa Nandi, Pm Keir, Priti Patel, Rishi Sun

తాజాగా యూకే పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌‌లో( House Of Commons ) ప్రతిపక్షనేత పదవి కోసం భారత సంతతి నేత, మాజీ హోం సెక్రటరీ , కన్జర్వేటివ్ పార్టీ నేత ప్రీతి పటేల్( Priti Patel ) బరిలో నిలిచారు.తాజా ఎన్నికల్లో టోరీలు దారుణ పరాజయాన్ని మూటగట్టుకుని.విపక్షంలో నిలిచారు.

ఈ నేపథ్యంలో ఆ పార్టీ తరపున ప్రతిపక్షనేతగా ఎవరు ఉండబోతున్నారన్న విషయంపై ఆసక్తి నెలకొంది.ఇందుకోసం నవంబర్ 2న పార్టీలో ఎన్నిక నిర్వహించనున్నారు.

అప్పటి వరకు మాజీ ప్రధాని రిషి సునాక్ తాత్కాలిక ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తారు.ఈ పదవి కోసం పోటీపడాలని ప్రీతి పటేల్ నిర్ణయించుకున్నారు.

మాజీ మంత్రులు జేమ్స్ క్లెవర్లీ, టామ్ టుగెంఢట్, మెల్ స్ట్రైడ్‌ తదితరులతో ఆమె తలపడనున్నారు.

Telugu Conservative, Pm Rishi Sunak, Lisa Nandi, Pm Keir, Priti Patel, Rishi Sun

లండన్‌లోనే జన్మించిన ప్రీతి తల్లిదండ్రుల స్వస్థలం గుజరాత్‌.వారు మొదట ఉగాండాలో నివసించేవారు.అయితే, ఉగాండాలో అప్పుడున్న పాలకుడు దక్షిణాసియాకు చెందినవారిపై దేశ బహష్కరణ విధించారు.

దీంతో ప్రీతి తల్లిదండ్రులు బ్రిటన్‌కు వలసవచ్చారు.వైట్‌ఫోర్డ్ గ్రామర్ స్కూల్, వెస్ట్‌ఫీల్డ్ టెక్ కాలేజ్, కీల్ వర్సిటీ, ఎసెక్స్ విశ్వవిద్యాలయాల్లో ప్రీతి చదువుకున్నారు.20 ఏళ్లు కూడా నిండకముందే ప్రీతి కన్జర్వేటివ్ పార్టీలో చేరారు.

కన్జర్వేటివ్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉద్యోగినిగా సేవలందించారు.1995 నుంచి 1997 వరకూ జేమ్స్ గోల్డ్‌స్మిత్ నేతృత్వంలోని రెఫరెండమ్ పార్టీకి ప్రతినిధిగా ఉన్నారు.ఆ పార్టీ యురోపియన్ యూనియన్‌ను వ్యతిరేకించింది.

డేవిడ్ కేమరూన్ హయాంలో ఏడాదిపాటు ట్రెజరీ శాఖలో సహాయమంత్రిగా, మరో ఏడాది ఉద్యోగకల్పన శాఖలో మంత్రిగా ఆమె పనిచేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube