విద్యాలయాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి - కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలోని ఏకలవ్య పాఠశాలల ఆవరణ పరిశుభ్రంగా ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.ఎల్లారెడ్డిపేటలోని ఆ విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 School Surroundings Should Be Clean Collector Sandeep Kumar Jha, School Surround-TeluguStop.com

ఈ సందర్భంగా విద్యాలయంలోని తరగతి గదులు, మైదానం, డైనింగ్ హాల్, టాయిలెట్స్ ను పరిశీలించారు.అధికారులకు పలు సూచనలు చేశారు.

ఇక్కడ ప్రిన్సిపాల్ మందిత్, ఉపాద్యాయులు ఉన్నారు.

రంగంపేటలో పరిశీలన

వీర్నపల్లి మండలం రంగంపేట ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదివారం పరిశీలించారు.

ఈ సందర్భంగా స్కూల్ లోని తరగతి గదులు, మైదానం, వంట గది, ఆవరణను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.స్కూలు లో మొత్తం ఎంత మంది విద్యార్థులు చదువుతున్నారని ఎంఈఓ రఘుపతిని అడిగి తెలుసుకున్నారు.

మొత్తం మూడు తరగతి గదులు ఉన్నాయని, దాదాపు 70 మంది విద్యార్థులు చదువుతున్నారని మరోగది నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని కలెక్టర్ దృష్టికి ఎంఈఓ తీసుకెళ్లారు.అనంతరం కలెక్టర్ మాట్లాడారు.

స్కూల్ ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

రోడ్డు పనులు.

ఎల్లారెడ్డిపేట నుంచి మర్రిమడ్ల దాకా రోడ్డు నిర్మాణంలో భాగంగా వీర్నపల్లి మండల కేంద్రంలో చేపట్టిన సీసీ రోడ్డు పనులను కలెక్టర్ పరిశీలించారు.పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో ఏ.ఈ శ్రీకాంత్, స్కూల్ కాంప్లెక్ హెచ్.ఎం శ్రీనివాస్, హెచ్ఎం మానసవీణ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube