ప్రైవేట్ హాస్పిటల్స్ ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ తీసుకోవాలి..కలెక్టర్ అనురాగ్ జయంతి

ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లాలోని అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యం తప్పనిసరిగా రాష్ట్ర అగ్ని మాపక శాఖ నుంచి ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ తీసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో మొత్తం 144 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయని వెల్లడించారు.

ఆయా దవాఖానల్లో ఫైర్ సేఫ్టీ పరికరాలు ఏర్పాటు చేసుకున్న వారందరూ తప్పనిసరిగా అగ్నిమాపక శాఖ వెబ్సైట్ https://fire.telangana.gov.in/ లో తమ హాస్పిటల్ వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.

ఆన్లైన్ లో వివరాలు నమోదు చేసిన అనంతరం అగ్ని మాపక శాఖ వారితో ఫైర్ సేఫ్టీ ఆడిట్ చేయించుకొని ఫైర్ శాఖ ద్వారా ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

కొండాపూర్ లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
Advertisement

Latest Rajanna Sircilla News