సూపర్ స్టార్ మహేష్ బాబును ఢీ కొట్టే విలన్ అతనే.. చివరకు అతనికే ఛాన్స్ దక్కిందా?

టాలీవుడ్ హీరో మహేష్ బాబు( Mahesh Babu ) రాజమౌళి( Rajamouli ) కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది ఎప్పుడు విడుదల అవుతుంది అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం తెలియడం లేదు.

కానీ ఈ సినిమాకు సంబంధించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.ఈ వార్తలు సినిమాపై అంతకంతకు అంచనాలు పెరిగేలా చేస్తూనే ఉన్నాయి.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపించిన విషయం తెలిసిందే.ఇకపోతే ఇప్పుడు విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్( Prithviraj Sukumaran ) పేరు తెరపైకి వచ్చింది.

Prithviraj Sukumaran As Antagonist In Mahesh Babu Rajamouli Ssmb 29 Details, Pri

రాజమౌళి సినిమాలో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో, విలన్‌కి( Villain ) కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుందన్న సంగతి తెలిసిందే.పైగా రాజమౌళి సినిమాలోని విలన్ పాత్రలకు సపరేట్ క్రేజ్ కూడా ఉంటుంది అనడంతో ఎటువంటి సందేహం లేదు.కాగా ఆర్ఆర్ఆర్ సినిమా( RRR ) తరువాత రాజమౌళి తీస్తున్న సినిమా కావడంతో అంతర్జాతీయంగా ఈ SSMB 29 మీద ఫోకస్ పడింది.

Advertisement
Prithviraj Sukumaran As Antagonist In Mahesh Babu Rajamouli Ssmb 29 Details, Pri

ఇక్కడ మహేష్ బాబు ఇమేజ్‌కి తగ్గట్టునే హాలీవుడ్, అంతర్జాతీయ స్థాయిలో సినిమాను తీయబోతోన్నాడు.దీనికి తగ్గట్టే ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో కథను విజయేంద్ర ప్రసాద్( Vijayendra Prasad ) రాశారట.

ఫారెస్ట్ అడ్వెంచర్‌గా ఈ చిత్రం ఉండబోతోందని సమాచారం.

Prithviraj Sukumaran As Antagonist In Mahesh Babu Rajamouli Ssmb 29 Details, Pri

SSMB 29 ప్రాజెక్ట్‌ను ఈ ఏడాది ప్రారంభిస్తారని తెలుస్తోంది.ఈ మూవీ కోసమే మహేష్ బాబు జుట్టుని పెంచుకుంటున్నాడు.హెయిర్ స్టైల్ పూర్తిగా మారబోతోంది.

లుక్ మాత్రం డిఫరెంట్‌గా, ఇది వరకెన్నడూ చూడని విధంగా ఉంటుంది.అయితే ఈ మూవీ కోసం మాలీవుడ్ స్టార్ హీరో, డైరెక్టర్‌ పృథ్వీరాజ్ సుకుమార్‌ను విలన్‌గా రాజమౌళి తీసుకున్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

గతంలో మహేష్ బాబు సినిమాలో నటించబోయే విలన్ ఇతనే అంటూ చాలామంది పేర్లు వినిపించిన విషయం తెలిసిందే.మొత్తానికి పృథ్వీరాజ్ పేరు ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు