ధర్మపురి ఎన్నిక ఫలితాలపై ఎక్కడైనా చర్చకు సిద్ధం.. మంత్రి కొప్పుల

ఎన్నికల రీకౌంటింగ్ గురించి తనపై ఆరోపణలు చేయడం బాధాకరమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.30 ఏళ్లు మచ్చలేని జీవితాన్ని గడిపానన్నారు.

కోర్టు తీర్పు తరువాత అడ్లూరి లక్ష్మణ్ పై న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు.

ధర్మపురి ఎన్నికలపై కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ తనపై ఆరోపణలు చేశారని మంత్రి కొప్పుల పేర్కొన్నారు.నిబంధనల ప్రకారమే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎంలను ధర్మపురి కాలేజీలో భద్రపరిచారని చెప్పారు.

లక్ష్మణ్ కుమార్ అనుమానించిన పది బూతుల్లో ఓట్ల తేడాలు లేవన్నారు.ధర్మపురి ఎన్నిక ఫలితాలపై ఎక్కడ అయినా చర్చించుకుందామని సవాల్ చేశారు.

ఎన్నికకు సంబంధించిన సీసీ కెమెరా ఒరిజినల్ ఫుటేజ్ ను కోర్టులో సమర్పించి లక్ష్మణ్ చిత్తశుద్ధి చాటుకోవాలని కోరారు.

Advertisement
పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Latest Latest News - Telugu News