నీళ్ల సెంటిమెంట్ రాజేసే ప‌నిలో ప్ర‌శాంత్‌రెడ్డి.. కేసీఆర్ డైరెక్ష‌న్‌లోనే!

ప్ర‌స్తుతం తెలంగాణ‌, ఆంధ్ర మ‌ధ్య నీళ్ల జ‌గ‌డం న‌డుస్తోంది.కొన్నేళ్లుగా రెండు ప్ర‌భుత్వాలు స్నేహ పూర్వ‌కంగానే న‌డుచుకున్నాయి.

ఇరువురు సీఎంలు కేసీఆర్‌, జ‌గ‌న్‌లు క‌లిసి ఎన్నో వివాదాల‌పై చ‌ర్చించుకుని ప‌రిష్కరించుకున్నారు.అదే క్ర‌మంలో కృష్ణా నీళ్ల‌పై కూడా ఇరువురు అప్ప‌ట్లో చ‌ర్చించుకుని ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు.

అప్పుడు కేసీఆరే స్వ‌యంగా కృష్ణా నీళ్ల‌ను వాడుకోవ‌డానికి ఆంధ్రాకు అవ‌కాశం ఇచ్చిన‌ట్టు చెప్పారు.కానీ ఇప్పుడు ఏపీ కృష్ణా న‌దిపై క‌డుతున్న అక్ర‌మ ప్రాజెక్టుల విష‌యంలో కేసీఆర్ ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా ఉంది.

మొన్న జరిగిన కేబినెట్‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై న్యాయ‌ప‌ర‌మైన పోరుకు సిద్ధ‌మ‌వ్వాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించారు.దీంతో మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి రంగంలోకి దిగారు.

Advertisement

స్వ‌యంగా ఆయ‌నే జ‌గ‌న్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు.కృష్ణా నీళ్ల విష‌యంలో జ‌గ‌న్‌ను దొంగగా వ‌ర్ణిస్తున్నారు.

అయితే ఇదంతా కేసీఆర్ డైరెక్ష‌న్‌లోనే జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది.ఎందుకంటే ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వం క‌డుతున్న సంగ‌మేశ్వ‌రం ద్వారా రంగారెడ్డి, న‌ల్గొండ, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల‌కు నీటి క‌ట‌క‌ట త‌ప్పేలా లేదు.

కాబట్టి దీనిపై కేసీఆర్ డైరెక్టుగా మాట్లాడ‌కుండా నీళ్ల సెంటిమెంట్‌ను రాజేస్తూ ప్ర‌జ‌ల్లో సానుభూతి కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు.ఎందుకంటే గ‌తంలో స్వ‌యంగా కేసీఆరే కృష్ణానీళ్ల‌ను వాడుకోవ‌చ్చిన జ‌గ‌న్‌కు చెప్పారు.

ఇప్పుడు ఆ మాట‌ల‌ను క‌ప్పిపుచ్చుకోవ‌డానికే ఈ ర‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

నీళ్ల సెంటిమెంట్ రాజేసి చివ‌ర‌కు ఆ ప్రాజెక్టుపై తాను ఎల్ల‌ప్పుడూ వ్య‌తిరేక‌మే అన్న‌ట్టు కేసీఆర్ వ్య‌హ‌రిస్తున్నారు.అంటే మొత్తానికి కేసీఆర్ స్వ‌యంగా కాకుండా మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డితో నీళ్ల జ‌గ‌డాన్ని రాజేస్తున్నార‌న్న‌మాట‌.అయితే మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డిది ఆ శాఖ కాదు.

Advertisement

అలాగే ఆయ‌న‌ది కృష్ణాన‌ది ఉన్న జిల్లా కూడా కాదు.ఆయ‌న‌ది నిజామాబాద్ ప‌రిధి.

మ‌రి ఆయ‌న‌తో ఎందుకు మాట్లాడిస్తున్నారో కేసీఆర్ ఊహ‌కే అందాలి.ఏదేమైనా కేసీఆర్ ప్లాన్‌తో జ‌గ‌న్‌ను ఇర‌కాటంలో పెట్టే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయి.

కానీ ఇదే విష‌యంపై వైసీపీ మాత్రం సానుకూలంగాన ఉంటోంది.తాము చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మ‌ని చెబుతోంది.

చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో.

తాజా వార్తలు