Pragathi: ఆ నిర్మాతతో రెండో పెళ్లికి రెడీ అయిన ప్రగతి ఆంటీ.. ఎప్పుడంటే..?

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో హీరో హీరోయిన్లకు తల్లి, అత్త పాత్రల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించింది నటి ప్రగతి(Actress Pragathi).

ఈమె తన అందం,అభినయంతో ఎంతోమంది కుర్ర హీరోయిన్లకు సైతం పోటీ ఇస్తుంది.

ఇక ఈమె ఇంత వయసు వచ్చినా కూడా జిమ్ లో వర్కౌట్లు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.ఇక అందరూ ప్రగతిని ప్రగతి (Pragathi) ఆంటీ అని ముద్దుగా పిలుచుకుంటారు.

ఇదిలా ఉంటే తాజాగా ప్రగతి గురించి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది.అదేంటంటే ప్రగతి ఆ నిర్మాతతో రెండో పెళ్లికి రెడీ అయింది అని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

మరి ఇంతకీ ప్రగతి రెండో పెళ్లి చేసుకోబోతున్న ఆ నిర్మాత ఎవరు.నిజంగానే ప్రగతి పెళ్ళికి( Pragathi Marriage ) ఒప్పుకుందా అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో దూసుకుపోతున్న ప్రగతి కేవలం సినిమాలే కాకుండా బుల్లితెరపై కూడా నటిస్తుంది.అయితే అలాంటి ప్రగతి ప్రస్తుతం ఒంటరిగా ఉంటుందనే సంగతి చాలా మందికి తెలియదు.

చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న ప్రగతి కొద్ది సంవత్సరాలకే భర్తతో కలిసి ఉండలేక ఆయనకు విడాకులు ఇచ్చేసి ఇండస్ట్రీలో రాణించింది.అలా ఇండస్ట్రీలో ఎంతోమంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రగతిని ఓ స్టార్ ప్రొడ్యూసర్ (Producer) పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట.

ఇక ఈ విషయాన్ని స్వయంగా ప్రగతికి కూడా చెప్పడంతో ప్రగతి పెళ్లి చేసుకోవాలా వద్దా అనే ఆలోచనలో పడిందట.అయితే ఆ ప్రొడ్యూసర్ కి ఎలాంటి చెడు అలవాట్లు లేకపోవడంతో ప్రగతి ఈ వయసులో తనకి తోడు అవసరం అని, రెండో పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకుందట.మరి నిజంగానే ప్రగతి రెండో పెళ్లి చేసుకుంటుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.

నీలిరంగు చీరలో అదరహో అనిపిస్తున్న అనుపమ.. చీర ఖరీదెంతో తెలుసా?
Advertisement

తాజా వార్తలు