యంగ్‌ హీరో సినిమాకు నో చెప్పిన 'సీతారామం' బ్యూటీ

హిందీ ప్రేక్షకులకు మొదట్లో సీరియల్స్ ద్వారా పరిచయం అయిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్‌( Mrunal Thakur ).బుల్లి తెర ద్వారా వెండి తెరపై అడుగు పెట్టింది.

 Sitaramam Heroine Mrunal Thakur Says No To Tollywood Hero,sitaramam,hi Nanna,fam-TeluguStop.com

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన కొద్ది సమయం లోనే మృణాల్‌ ఠాకూర్ కి మంచి గుర్తింపు లభించింది.అక్కడ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తున్న సమయం లో తెలుగు లో హను రాఘవపూడి ఈమె ను సీతారామం సినిమా( Sitaramam ) లో నటింపజేశాడు.

అక్కడ హాట్‌ అందాలతో అలరిస్తున్న మృణాల్ ను ఇక్కడకు తీసుకు వచ్చి పద్దతైన చీర కట్టు లో దుల్కర్ సల్మాన్‌ కి జోడీగా చూపించాడు.సీతారామం సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో… ఆ సినిమా వల్ల మృణాల్ కి ఎంతటి ఫేమ్‌ ఇక్కడ దక్కిందో మనం అంతా చూశాం.

Telugu Nanna, Mrunal Thakur, Sitaramam, Telugu-Movie

ప్రస్తుతం నాని తో హాయ్ నాన్న( Hi Nanna ) సినిమా లో నటిస్తున్న ఈ అమ్మడు మరో వైపు ఒక యంగ్‌ స్టార్‌ హీరో సినిమాకు ఓకే చెప్పింది.ఆ సినిమా షూటింగ్‌ ఇంకా మొదలు కాలేదు.ఇక విజయ్ దేవరకొండ తో కలిసి ఫ్యామిలీ స్టార్‌ సినిమా( Family Star ) లో నటిస్తోంది.తెలుగు లో మూడు సినిమా లు చేస్తోన్న మృణాల్ ఠాకూర్ కి మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి.

కాని వాటిల్లో కొన్నింటిని కనీసం కథ కూడా వినకుండా తిరష్కరిస్తూ ఉంటే కొన్ని మాత్రం కథ విన్న తర్వాత నో చెబుతోంది.తాజాగా టాలీవుడ్‌ కు చెందిన ఒక యంగ్‌ హీరో( Young Hero ) కు జోడీగా నటించాల్సిందిగా నిర్మాణ సంస్థ ప్రతినిధులు మృణాల్ ను సంప్రదించారట.

Telugu Nanna, Mrunal Thakur, Sitaramam, Telugu-Movie

ఆ హీరో పేరు చెప్పగానే కథ ఏంటి, దర్శకుడు ఎవరు అనే విషయాన్ని కూడా అడుగకుండా ఇప్పుడు తన డేట్లు ఖాళీ లేవు అంటూ చెప్పేసిందట.మృణాల్‌ ఠాకూర్ నుంచి వచ్చిన సమాధానంతో సదరు నిర్మాణ సంస్థ ప్రతినిధులు షాక్ అయ్యారట.కథ వింటే తప్పకుండా మీరు మనసు మార్చుకుంటారని చెప్పేందుకు ప్రయత్నించారట.వచ్చే ఏడాది ద్వి తీయార్థం లో డేట్లు ఇచ్చినా పర్వాలేదని వారు అన్నారట.అయినా కూడా మృణాల్‌ ఆ హీరో తో నటించేందుకు నో చెప్పిందట.ఇంతకు ఆ హీరో ఎవరు అనేది ముందు ముందు తెలిచేనేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube