రెండో పెళ్లి కి సిద్దమైన ప్రభుదేవా...వధువు ఎవరంటే!

సెలబ్రిటీల విషయంలో పలు రకాల రూమర్స్ వస్తూనే ఉంటాయి.

వారు మాట్లాడే మాటలకూ ,చేతలకు అభిమానులు తమ దైన రీతిలో ఊహించుకొని రూమర్స్ ను స్ప్రెడ్ చేస్తూ ఉంటారు.

అయితే ఇప్పుడు తాజాగా ఇండియన్ మైఖేల్ జాక్సన్‌, మల్టీటాలెంటెడ్‌ ప్రభుదేవా మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.గత కొన్ని రోజులుగా మేన కోడలు వరుస అయ్యే శోభ అనే అమ్మాయితో రిలేషన్‌లో ఉంటున్నాడని, ఆమెనే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం చక్కర్లు కొడుతోంది.ప్రముఖ కొరియోగ్రాఫర్ సుందరం మాస్టర్ తనయుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రభుదేవా అంచెలంచెలుగా ఎదిగి నటుడిగా,కొరియోగ్రాఫర్ గా,నిర్మాతగా,దర్శకుడిగా ఎదిగారు.

అయితే 1995 లోనే ఆయన రమా లత అనే ఆమెను ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నాడు.వారికి ముగ్గురు పిల్లలు కూడా కలిగిన తరువాత ఇండస్ట్రీ లో బిజీ గా ఉంటూ ఆ సమయంలోనే లేడీ సూపర్ స్టార్ నయన తార తో ప్రేమలో పడి పెళ్లి వరకు కూడా వచ్చారు.

Advertisement
Prabhudeva Getting Ready For Second Marriage , Prabhudeva, Ramalatha, Salman Kha

దీనితో తన భార్య రమా లత కు విడాకులు కూడా ఇచ్చి పెళ్ళికి సిద్దమైన సమయంలో ఉన్నట్టుండి కొన్ని కారణాల వల్ల వారి పెళ్లి ఆగిపోయింది.

Prabhudeva Getting Ready For Second Marriage , Prabhudeva, Ramalatha, Salman Kha

దీనితో అప్పటినుంచి సింగిల్ గా ఉంటున్న ప్రభుదేవా మేనకోడలి వరుస అయ్యే శోభ అనే యువతితో రిలేషన్ లో ఉంటున్నాడని,త్వరలోనే వారు పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది.మరి దీనిపై స్పష్టత రావాలి అంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.మరోపక్క ప్రస్తుతం ప్రభుదేవా బాలీవుడ్ లో బిజీ గా ఉంటున్నారు.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ తో రాధే చిత్రం తెరకెక్కిస్తున్న ప్రభుదేవా,అలానే తేల్, యంగ్ మంగ్ సంగ్,ఓమై విళిగల్,బఘీర అనే చిత్రాల్లో నటిస్తున్నట్లు సమాచారం.

హైదరాబాద్ చేరుకున్న మార్క్ శంకర్.. వీడియో వైరల్
Advertisement

తాజా వార్తలు