సమంతతో డార్లింగ్‌కు అదే సమస్యనట!

టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ నటించిన సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ కోసం అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు.

ఒక్కసారైనా ప్రభాస్ సినిమాలో నటిస్తే, తమ కెరీర్‌కు చాలా ఉపయోగపడుతుందని వారు అనుకుంటారు.

కాగా టాలీవుడ్ హీరోయిన్ల గురించి ఎప్పుడూ పాజిటివ్‌గానే చెప్పే ప్రభాస్, ఒక్క హీరోయిన్ గురించి మాత్రం చాలా ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు.ప్రభాస్ తన సినిమాల్లో నటించే హీరోయిన్ల విషయంలో అన్ని అంశాలను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంటాడు.

ఈ క్రమంలో తనకు ఏ హీరోయిన్‌తో కూడా సమస్య రాలేదని, కానీ స్టార్ హీరోయిన్ సమంతతో నటించాలంటే మాత్రం పెద్ద సమస్య వచ్చి పడిందని ప్రభాస్ ఓ సందర్భంలో తెలిపాడు.తన హైట్‌కు సమంత చాలా పొట్టిగా కనిపిస్తుందనేది ప్రభాస్ భావన.

మిగతా హీరోయిన్ల తన హైట్‌ను మ్యాచ్ చేశారు కాబట్టి వారితో సినిమాలు చేశానని ప్రభాస్ తెలిపాడు.అందుకే ఇప్పటివరకు ప్రభాస్ సమంతతో ఒక్క సినిమాలో కూడా నటించలేదని తెలుస్తోంది.

Advertisement

కానీ నిజానికి సమంత మరీ అంత పొట్టిగా ఏం ఉండదని, ఇండస్ట్రీలో మహేష్ లాంటి వారితో కూడా సమంత మ్యాచ్ చేసిందని, మరి ప్రభాస్‌కు ఇలా ఎందుకు అనిపించిందా అని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.దీంతో ప్రభాస్‌కు సమంతతో వేరే విషయంలో సమస్య ఉందని, అందుకే ఇలాంటి వంక పెడుతున్నాడని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.

నీకు ఆఫర్లు లేకుండా చేస్తామంటూ జబర్దస్త్ రాకేశ్ కు పవన్ ఫ్యాన్స్ వార్నింగ్.. ఏమైందంటే?
Advertisement

తాజా వార్తలు