Prabhas: ఒక నైట్ డిన్నర్ కోసం ప్రభాస్ చేసే ఖర్చు ఎంతో తెలుసా… ఏకంగా అన్ని లక్షలా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి సీనియర్ దివంగత నటుడు కృష్ణంరాజు వారసుడిగా అడుగుపెట్టారు నటుడు ప్రభాస్. ఈశ్వర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

మొదటి సినిమాతోనే తన నటన ద్వారా మెప్పించినటువంటి ప్రభాస్ (Prabhas) అనంతరం ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలను అందుకొని హీరోగా కొనసాగుతున్నారు.ఇక ఈయన బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.ఇలా పాన్ ఇండియా స్టార్ హీరోగా ప్రభాస్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో అప్పటినుంచి ఈయన చేసే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

ఇటీవల ప్రభాస్ నటించిన సలార్(Salaar) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది.ఇలా నటుడిగా ప్రభాస్ ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్నారనే చెప్పాలి.

Advertisement

ఇక నటుడిగా మాత్రమే కాకుండా ఈయన ఎంతో మంచి మనసున్న వ్యక్తిగా కూడా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.

ప్రభాస్ కుటుంబం రాజుల వంశానికి చెందినటువంటి కుటుంబం.ఇలా రాజుల వంశానికి చెందినటువంటి కుటుంబం కావడంతో ఇతరులకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో ప్రభాస్ కి ఎవరు కూడా సాటి రారని చెప్పాలి.అప్పట్లో కృష్ణంరాజు(Krishnam Raju) కూడా తన తోటి వారందరికీ ఎన్నో రకాల ఆహార పదార్థాలను తెప్పించి వారి కడుపు నింపేవారు.

ఇలా తన పెదనాన్న బాటలోనే ప్రభాస్ కూడా నడుస్తున్నారని చెప్పాలి సినిమా షూటింగ్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈయన వివిధ రకాల ఆహార పదార్థాలను తెప్పిస్తారు అంటూ ఎంతో మంది సెలెబ్రెటీలు ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి తెలిపారు.

ప్రభాస్ భోజనం పెట్టి చంపేస్తారు అంటూ పలువురు సెలబ్రిటీలు ఈయన గురించి వెల్లడించారు.ఇక ప్రభాస్ భోజనం చేసిన కూడా అన్ని రకాల ఆహార పదార్థాలు( Food Items ) టేబుల్ పై ఉండాల్సిందే ఆయన అన్ని తింటారని కాదు కానీ ఆయన ఏది అడుగుతారో తెలియక అన్ని రకాల పదార్థాలు తన టేబుల్ పై ఉండేవని ఒకవేళ తను అడిగినది లేకపోయినా అది తెప్పించుకొని తింటారని తెలుస్తోంది.ఇక ఈయన భోజనం చేసే సమయంలో ఒక్కడే భోజనం చేయడం చాలా అరుదుగా జరుగుతుంటుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఈయన భోజనం చేశారు అంటే ఒక పదిమంది వరకు అయినా తన పక్కన ఉండాలట.

Advertisement

ఇలా భోజన ప్రియుడుగా గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ తాను ఎలా భోజనం చేస్తారో తన పక్క వారికి కూడా అలాగే పెడతారు.మరి ఈయన ఇన్ని రకాల ఆహార పదార్థాలు తయారు చేయిస్తారు అంటే ఒక పూట భోజనం చేయడం కోసం ఈయన ఎంత ఖర్చు చేస్తారో అన్న విషయం గురించి ఒక వార్త వైరల్ గా మారింది.ప్రభాస్ రాత్రిపూట డిన్నర్( Dinner ) చేయాలి అంటే సుమారు రెండు నుంచి మూడు లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తారట.

ఈయనతో పాటు మరొక పదిమంది దాకా భోజనం చేస్తారని ఇలా అందరి ఖర్చు కలిపి సుమారు 3 లక్షల రూపాయల వరకు ఉంటుందనే విషయం తెలియడంతో ఒకసారి అందరు షాక్ అవుతున్నారు ఒక్క పూట భోజనం కోసం ప్రభాస్ ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు చేస్తారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు