మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) ప్రస్తుతం వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.ఈయన ఒకానొక సమయంలో స్టార్ హీరోగా అగ్ర దర్శకుల సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
అయితే ఈయన తన కెరీర్ కు బ్రేక్ ఇచ్చి కొంతకాలం పాటు రాజకీయాలలోకి వెళ్లారు.అయితే రాజకీయాలలో సాధించలేనటువంటి చిరంజీవి తిరిగి సినిమాలలోకి వచ్చారు.
ఈయన తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత వరుస సినిమాలలో నటించడమే కాకుండా యంగ్ డైరెక్టర్ లకు అవకాశం కల్పిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
సాధారణంగా చిరంజీవితో సినిమాలు చేయాలి అంటే ఎంతో మంది స్టార్ డైరెక్టర్లు కూడా అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితిలు ఏర్పడుతుంటాయి.అలాంటిది స్వయంగా చిరంజీవి కొంతమంది డైరెక్టర్లను పిలిపించి మరి అవకాశాలు కల్పిస్తున్నారు.
ప్రస్తుతం ఈయన డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాకు కమిట్ అయిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఇంతకంటే ముందుగానే మెగాస్టార్ చిరంజీవి హిట్ సినిమా డైరెక్టర్ శైలేష్ కొలను ( Sailesh Kolanu ) దర్శకత్వంలో నటించాల్సి ఉండేదట.

హిట్ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి డైరెక్టర్ శైలేష్ ను ఇంటికి పిలిపించి చిరంజీవి తనతో సినిమా చేస్తానని మంచి కథ సిద్ధం చేసుకోమని చెప్పారట.అయితే ఈయన చిరంజీవితో సినిమా చేయడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు.అలాంటిది స్వయంగా చిరంజీవి తనని ఇంటికి పిలిపించి మరి తన కోసం కథ సిద్ధం చేయమనడంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ప్రస్తుతం శైలేష్ వెంకటేష్ హీరోగా నటిస్తున్నటువంటి సైందవ్ ( Saindhav ) సినిమా పనులలో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాపై ఈయన ఫోకస్ పెట్టబోతున్నారు అయితే మరోసారి చిరంజీవి ఈయనని ఇంటికి పిలిపించారట.

ఇలా ఇంటికి పిలిపించినటువంటి చిరంజీవి కథ సిద్ధమైందా అని అడగడంతో తనకు మరొక ఆరు నెలల సమయం కావాలి అని అడిగారట దీంతో డైరెక్టర్ అడిగినటువంటి సమయాన్ని చిరంజీవి ఇచ్చారని తెలుస్తోంది.ఇలా ఈ సమయంలో చిరంజీవి మరో డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చి ఈ సినిమా పనులలో బిజీ అయ్యారు.సాధారణంగా చిరంజీవి అందరి డైరెక్టర్లను లైన్ లో పెడతారు అలాంటిది చిరంజీవిని ఈ డైరెక్టర్ క్యూ లైన్ లో నిలబెట్టారు అంటూ పలువురు ఈయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా చిరంజీవిని వెయిట్ చేయించడం నిజంగా అవమానమే అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు అయితే మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోతో సినిమా చేస్తున్నారు అంటే అది చరిత్రలో నిలిచిపోయే సినిమాగా ఉండాలని అందుకే చిరంజీవిని సమయం అడిగినట్టు ఈయన పలు సందర్భాలలో తెలియజేశారు.







