వరుసగా మూడోసారి మోస్ట్ పాపులర్ హీరోగా ప్రభాస్.. అందరికీ భారీ షాకిస్తున్నాడుగా!

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు పాన్ ఇండియా లెవెల్ లో మారుమోగుతున్న పేరు డార్లింగ్ ప్రభాస్.

చేతినిండా బోలెడు పాన్ ఇండియా సినిమా ప్రాజెక్టులతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న ప్రభాస్, మరోవైపు తాను నటించిన సినిమాలు సక్సెస్ అవడంతో అదే ఊపుతో ఇప్పుడు మరిన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదు ఆరు సినిమాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.ఇవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.

కాగా ప్రభాస్ ఇటీవల నటించిన రెండు సినిమాలు సూపర్ హిట్టుగా నిలవడంతో పాటు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాయి.

ఇది ఇలా ఉంటే పాన్ ఇండియా హీరో ప్రభాస్ కి తాజాగా మరొక ఘనత దక్కింది.అదేమిటంటే ప్రేమతో మీడియా సంస్థ ఆర్మ్యాక్స్ విడుదల చేసినా మోస్ట్ పాపులర్ హీరోల జాబితాలో మరొకసారి టాప్ లో నిలిచారు డార్లింగ్ ప్రభాస్( Prabhas).తాజాగా ఆర్మాక్స్‌( Ormax ) జులై నెలకు సంబంధించి దేశవ్యాప్తంగా మోస్ట్‌ పాపులర్‌ స్టార్‌ల జాబితాను విడుదల చేసింది.ఇందులో ప్రభాస్‌ అగ్రస్థానంలో నిలిచారు.

Advertisement

మే, జూన్‌ నెలల్లో టాప్‌ వన్‌లో ఉన్న ప్రభాస్ జులై నెలలో కూడా అదే స్థానంలో ఉన్నారు.కల్కి విడుదల నేపథ్యంలో గత రెండు నెలలుగా ప్రభాస్‌ పేరు ట్రెండింగ్‌లో ఉంది.

తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన సందర్భంగా పలు వీడియోలు ఎక్స్‌లో సందడిగా మారాయి.

ఈ నేపథ్యంలో మూడోసారి కూడా ప్రభాస్‌ టాప్‌ వన్‌లోనే ఉన్నారు.ఆర్మాక్స్‌ జులై జాబితాలో విజయ్‌( Vijay ) రెండులో, షారుక్‌ ఖాన్‌ మూడో స్థానంలో ఉన్నారు.ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో డార్లింగ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!
Advertisement

తాజా వార్తలు