అప్పుడు ప్రభాస్ ఇప్పుడు అఖిల్.. ఆ నిర్మాత నమ్మకం నిజం కావడం సాధ్యమేనా?

మరో 12 రోజుల్లో థియేటర్లలో అఖిల్( Akhil ) హీరోగా సురేందర్ రెడ్డి( Surender Reddy ) డైరెక్షన్ లో తెరకెక్కిన ఏజెంట్ మూవీ విడుదల కానుంది.

సాక్షి వైద్య హీరోయిన్( Sakshi Vaidya ) గా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

ఏజెంట్ సినిమా( Agent movie )కు అనిల్ సుంకర నిర్మాత కాగా ఈ సినిమాకు 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చైంది.అఖిల్ ను నమ్మి నిర్మాత ఈ స్థాయిలో ఖర్చు చేయడం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

Prabhas Akhil Same In That Matter Details Here Goes Viral In Social Media , Prab

ఏప్రిల్ 28వ తేదీ టాలీవుడ్ ఇండస్ట్రీకి అచ్చొచ్చిన డేట్ కాగా అదే తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుండటం గమనార్హం.మొదట పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావించినా ఏప్రిల్ 28వ తేదీన బాలీవుడ్ లో పలు స్టార్ హీరోల సినిమాలు రిలీజవుతున్న నేపథ్యంలో తెలుగు, మలయాళంలో మాత్రమే నిర్మాతలు ఈ సినిమాను విడుదల చేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

Prabhas Akhil Same In That Matter Details Here Goes Viral In Social Media , Prab

అయితే అఖిల్ మార్కెట్ ను మించి ఖర్చు చేయడం గురించి నిర్మాత అనిల్ సుంకర స్పందిస్తూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి.బాహుబలి సినిమాకు ముందు ప్రభాస్ మార్కెట్ కు ఆ సినిమా తర్వాత ప్రభాస్ మార్కెట్ కు ఏ విధంగా తేడా ఉందో ఏజెంట్ సినిమాకు ముందు అఖిల్ మార్కెట్ కు ఏజెంట్ తర్వాత అఖిల్ మార్కెట్ కు తేడా ఉంటుందని అనిల్ సుంకర అభిప్రాయపడ్డారు.

Prabhas Akhil Same In That Matter Details Here Goes Viral In Social Media , Prab
Advertisement
Prabhas Akhil Same In That Matter Details Here Goes Viral In Social Media , Prab

ఈ సినిమాలో మమ్ముట్టి( Mammootty ) కీలక పాత్రలో నటించిన నేపథ్యంలో మలయాళంలో కూడా రికార్డ్ స్థాయి థియేటర్లలో ఈ సినిమా రిలీజవుతోంది.సోలో హీరోగా అఖిల్ కెరీర్ లో ఇప్పటివరకు 30 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిన సినిమా లేదు.అయితే ఏజెంట్ సినిమా ఆ లెక్కల్ని కచ్చితంగా మార్చుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఏడాది ఈ నెలలో విడుదలైన పలు సినిమాలు ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసిన నేపథ్యంలో ఏజెంట్ మూవీ అయినా ప్రేక్షకుల అంచనాలను మించి ఉంటుందేమో చూడాలి.

Advertisement

తాజా వార్తలు