మళ్లీ ఫారిన్ చెక్కేస్తున్న ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమాను పూర్తి పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త అవతారంలో కనిపిస్తుండటంతో ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా లాక్‌డౌన్‌కు ముందు ఈ సినిమా షూటింగ్‌ను యూరప్‌లోని జార్జియాలో జరుపుకున్న సంగతి తెలిసిందే.

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తుండటంతో చిత్ర యూనిట్ వెంటనే వెనక్కి తిరిగి వచ్చేసింది.ఇక ఇప్పుడు లాక్‌డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలకు పైగా ఇండియాలోనే ఉండిపోయిన ప్రభాస్ 20వ చిత్ర యూనిట్, త్వరలోనే మళ్లీ షూటింగ్‌ను ప్రారంభించాలని చూస్తున్నారు.

ఈ క్రమంలో తొలుత ఇండియాలోనే షూటింగ్ జరుపుకుని, జార్జియాలో మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేయాలని భావిస్తోంది.అన్నీ అనుకూలిస్తే జార్జియాకు వీలైనంత త్వరగా వెళ్లాలని ప్రభాస్ 20వ చిత్రం యూనిట్ భావిస్తోంది.

Advertisement

ఎందుకంటే, ప్రస్తుతం భారత్‌లోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుండటం, యూరప్ దేశంలో ఈ సంఖ్య తక్కువగా ఉండటంతో, అక్కడికి వెళ్తే కరోనా బారిన పడకుండా ఉండవచ్చని చిత్ర యూనిట్ భావిస్తుంది.మరి ఈ సినిమా షూటింగ్‌ను జార్జియాలో ఎప్పుడు మొదలుపెడతారనేది ఆసక్తికరంగా మారింది.

నీకు ఆఫర్లు లేకుండా చేస్తామంటూ జబర్దస్త్ రాకేశ్ కు పవన్ ఫ్యాన్స్ వార్నింగ్.. ఏమైందంటే?
Advertisement

తాజా వార్తలు