కొత్తపేటలో ఘనంగా ప్రారంభమైన ప్రభల ఉత్సవాలు...

మేళతాళాలు మంగళ వాయిద్యాలతో ఊరేగింపు బయలుదేరిన ప్రభలు,ఉభయగోదావరి జిల్లాల నుండి భారీగా తరలివచ్చిన జనం కొత్తపేట ప్రభల సంబరాలు ప్రత్యేకత కోనసీమలో అన్ని చోట్ల కనుమ పండుగ రోజున ప్రభల ఉత్సవాలు జరుగుతాయి కొత్తపేటలో మాత్రం పెద్ద పండుగ రోజున ప్రబల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారుప్రభలు అన్ని రుద్ర రూపాలతో తయారుచేస్తారు వీటిని తాటిదూలాలు, టేకు చెక్కలు, వెదురుబొంగులు, చేర్చి గోపురం ఆకారంలో నిర్మిస్తారు.

నూతనవస్త్రాలు, పూలదండలు,వరికంకులతో నెమలిపించాలతో ప్రత్యేకంగా అలంకరిస్తారు మధ్యలో రుద్రరూపాలతో కూడిన దేవతామూర్తుల ఉత్సవవిగ్రహాలను ఉంచుతారు ఇక్కడ ప్రధానంగా మూడు పార్టీలు బోడిపాలెం వంతెన, పాత రామాలయం, కొత్త రామాలయం వీరితోపాటు గ్రామంలో పలువీదులనుండి ప్రభల ఊరేగింపుగా బయలుదేరి మధ్యాహ్నం 4 గంటలకు ప్రభుత్వ కాలేజీ అవరణకు తీసుకు వస్తారు అనంతరం భారీ ఎత్తున బాణాసంచా కాల్చి రికార్డింగ్ డాన్సులు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు వీటిని తిలకించేందుకు వివిధ ప్రాంతాలనుండి వేలాదిగా జనం తరలివచ్చారు.

Prabhala Celebrations Started In Kottapeta, Prabhala , Celebrations , Godawari

తాజా వార్తలు