ఢిల్లీ లో కవితకు మద్దతు గా పోస్టర్ పాలిటిక్స్ !  

మరి కొద్ది సేపట్లో ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారించబోతున్నారు.

ఈ లిక్కర్ స్కాం పై అనేక వివాదాలు చోటుచేసుకున్నాయి.

రాజకీయంగా బిఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టేందుకే కవిత పేరును ఈ కేసులో చేర్చారని ఆ పార్టీ బిజెపి పై విమర్శలు చేస్తోంది.ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసులపై న్యాయపోరాటం చేస్తామని ఇప్పటికే కవిత ప్రకటించారు.

తాము ఏ తప్పు చేయలేదని, ఏ విచారణన అయినా ధైర్యంగా ఎదుర్కొంటామంటూ కవిత ప్రకటించడమే కాకుండా, ఈరోజు 11 గంటలకు జరగబోయే విచారణకు హాజరు కాబోతున్నారు.

ఇప్పటికే కవితకు మద్దతుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు.అలాగే మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కూడా ఢిల్లీలోనే మకాం వేశారు.ఎప్పటికప్పుడు తాజా పరిణామాలపై ఆరా తీస్తున్నారు.

Advertisement

ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవితతో పాటు, అరుణ్ రామచంద్ర పిళ్ళై ను కలిపి విచారించబోతున్నట్లు సమాచారం.ప్రధానంగా అరుణ్ పిళ్ళై తో కవిత ఆర్థిక లావాదేవీలపై ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం పై సేకరించిన ఆధారాలను, దర్యాప్తులో తేలిన అనేక వివరాలను ఆధారంగా చేసుకుని కవితను మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో విచారించేందుకు ఈడీ అధికారులు సిద్ధం అయ్యారు.ఇది ఇలా ఉంటే కవితకు మద్దతుగా ఢిల్లీలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు వెలిచాయి.

పోరాట యోధుడి బిడ్డ కవిత ఎప్పుడూ భయపడదు అంటూ బీఆర్ఎస్ నాయకులు కొందరు భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు .మరికొన్ని ఫ్లెక్సీల్లో బై బై మోదీ అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.దాడులతో కొందరు రాజకీయ నాయకులు మారిపోతారని, బిజెపి అలా చాలామందిని మార్చిందని, కానీ కొందరు మాత్రం ఎప్పటికీ ఒకేలా ఉంటారని, కెసిఆర్ బిడ్డ కవిత దేనికి భయపడదనే ఫోటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు ద్వారా జాతీయ మీడియాను ఆకర్షించి దేశవ్యాప్తంగా బిజెపిపై తాము రాజీ లేకుండా పోరాటం చేస్తున్నందుకే తమను ఈ విధంగా వేధింపులకు గురి చేస్తున్నారనే విధంగా చూపించి, రాజకీయంగా మైలేజ్ తెచ్చుకునే పనిలో బీ ఆర్ఎస్ ఉంది.

మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు