పెళ్లి చేసుకోనంటున్న హీరోయిన్.. ఎవరో తెలుసా?

టాలీవుడ్‌లో అందంతో పాటు అభినయంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు.

వారిలో కొంతమంది స్టార్ హీరోయిన్‌లుగా మారితే, చాలా మంది మీడియం, చిన్న రేంజ్ హీరోయిన్లుగా మిగిలిపోయారు.

ఇలాంటి కోవలోకే వస్తుంది నటి పూర్ణ.టాలీవుడ్‌లో ‘శ్రీమహాలక్ష్మీ’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంది.

Poorna Says Will Not Marry Anyone, Poorna, Actress Poorna, Marriage, Tollywood N

అయితే పెద్ద సినిమా ఏదీ అమ్మడికి పడకపోవడంతో కేవలం మీడియం రేంజ్ హీరోయిన్‌గానే మిగిలిపోయింది.ఇక ప్రస్తుతం తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోయినా కన్నడ, తమిళం, మలయాళంలో మంచి అవకాశాలు దక్కించుకుంది.

ఇక బుల్లితెరపై పలు షోలలో జడ్జిగా వ్యవహరిస్తున్న పూర్ణ, ఇటీవల వార్తల్లో నిలిచింది.కొందరు యువకులు ఆమెను వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఆమె పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Advertisement

ఓ ముఠాగా ఏర్పడిన వారు పూర్ణను పెళ్లి పేరుతో మోసం చేయాలని చూసినట్లు ఆమె ఫిర్యాదు చేసింది.ఈ ఘటనతో ఆమెకు పెళ్లిపై ఆసక్తి పోయిందని, తాను జీవితంలో పెళ్లి చేసుకోబోనని తన తల్లిదండ్రులకు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.

ఇలా ఓ హీరోయిన్ పెళ్లికి ససేమిరా అంటుండటంతో ప్రస్తుతం ఈ విషయం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.ఇక ఈ చిన్నది పెళ్లికి నో చెబుతుండటంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఒప్పంచే ప్రయత్నం చేస్తున్నారట.

ఏదేమైనా ఇలా ఓ హీరోయిన్‌ను వేధించిన ఆ ముఠాను పోలీసులు కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు.

థియేటర్లలో ఫ్లాప్.. యూట్యూబ్ లో రికార్డ్.. సౌందర్య నటించిన ఈ సినిమా గురించి తెలుసా?
Advertisement

తాజా వార్తలు